- Telugu News Photo Gallery Cinema photos Success of Extraordinary Man must to the careers of Nithin and Vakkantam Vamsi
Nithin and Vakkantam Vamsi: నితిన్, వక్కంతం వంశీ.. ఇద్దరికీ ఎక్స్ ట్రా గండం..!
అప్పట్లో వరుసగా 12 ఫ్లాప్ సినిమాలు ఇచ్చి రికార్డు సృష్టించిన నితిన్.. ఇష్క్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్, అ ఆ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. దాంతో ఈయన మార్కెట్ కూడా బాగానే పెరిగింది. స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నితిన్ తో సినిమాల కోసం ఎగబడ్డారు. అయితే ఆ తర్వాత అదే జోరు కంటిన్యూ చేయడంలో విఫలమయ్యాడు నితిన్. కొన్ని సంవత్సరాలుగా వరస పరాజయాలు ఇబ్బంది పెడుతున్నాయి.
Updated on: Oct 31, 2023 | 2:18 PM

2020లో విడుదలైన భీష్మ తర్వాత ఇప్పటి వరకు నితిన్ కెరీర్ లో మళ్ళీ చెప్పుకోదగ్గ సినిమా రాలేదు. ఆ తర్వాత ఆయన నటించిన చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. నిజానికి భీష్మ ముందు కూడా శ్రీనివాస కళ్యాణం, చల్ మోహనరంగా, లై లాంటి డిజాస్టర్స్ ఉన్నాయి. దాంతో నితిన్ కెరీర్ మళ్లీ గాడిన పడాలంటే వరుస విజయాలు అందుకోవాల్సిందే. మరో ఆప్షన్ కూడా లేదు.

ఇలాంటి సమయంలో ఈయన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అందులో వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ఒకటి. డిసెంబర్ 8న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా దీని టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత నాలుగేళ్లకు పైగా గ్యాప్ తీసుకొని వంశీ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. తొలి సినిమాలో పూర్తిగా సీరియస్ డ్రామా చూపించిన వక్కంతం.. రెండో సినిమాకు రూట్ మార్చాడు. ఈసారి ఎంటర్టైన్మెంట్ నమ్ముకున్నాడు ఈయన. నితిన్ సినిమా టీజర్ చూసిన తర్వాత ఇదే విషయం అర్థం అవుతుంది. నవ్వించి విజయం అందుకోవాలని ఫిక్స్ అయిపోయాడు ఈయన. టీజర్ లో ఎక్కువగా నితిన్ క్యారెక్టర్జేషన్ హైలెట్ చేశాడు వంశీ.

ఈ సినిమా విజయం హీరో, దర్శకుడు ఇద్దరికీ కీలకమే. ముఖ్యంగా వక్కంతం వంశీని హీరోలు నమ్మాలంటే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ విజయం సాధించాల్సిందే.. మరో ఆప్షన్ కూడా లేదు. రైటర్ గా సక్సెస్ అయిన దర్శకుడుగా తొలి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు నితిన్ కూడా వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న సమయంలో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ విజయం తప్పనిసరిగా మారింది.