- Telugu News Photo Gallery Cinema photos Small films like Maa Oori Polimera 2 Keedaa Cola mad got big success and getting the top collections at the box office
చిన్న సినిమాలు.. పెద్ద విజయాలు.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం
స్టార్ హీరోలు, పెద్ద సినిమాలు భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేస్తుంటే.. చిన్న సినిమాలే ప్రతీసారి ఇండస్ట్రీకి ఊపిరి ఊదుతున్నాయి. సీజన్‌లో కనీసం ఒక్క చిన్న సినిమా అయినా సంచలనం సృష్టిస్తుంది. అంచనాలు లేకుండా వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తాజాగా మరో రెండు సినిమాలు ఈ లిస్టులో జాయిన్ అయింది. అసలు 2023లో సర్‌ప్రైజ్ చేసిన స్మాల్ మూవీస్ ఏంటి..? కొన్ని సినిమాలు హీరోల కోసం.. మరికొన్ని దర్శకుల కోసం చూసే ఆడియన్స్ ఉంటారు. కానీ చిన్న సినిమాలు మాత్రం కేవలం కంటెంట్ కోసమే చూడాలి.
Updated on: Nov 05, 2023 | 9:37 PM

స్టార్ హీరోలు, పెద్ద సినిమాలు భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేస్తుంటే.. చిన్న సినిమాలే ప్రతీసారి ఇండస్ట్రీకి ఊపిరి ఊదుతున్నాయి. సీజన్‌లో కనీసం ఒక్క చిన్న సినిమా అయినా సంచలనం సృష్టిస్తుంది. అంచనాలు లేకుండా వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తాజాగా మరో రెండు సినిమాలు ఈ లిస్టులో జాయిన్ అయింది. అసలు 2023లో సర్‌ప్రైజ్ చేసిన స్మాల్ మూవీస్ ఏంటి..?

కొన్ని సినిమాలు హీరోల కోసం.. మరికొన్ని దర్శకుల కోసం చూసే ఆడియన్స్ ఉంటారు. కానీ చిన్న సినిమాలు మాత్రం కేవలం కంటెంట్ కోసమే చూడాలి.

అందులో కథ బలంగా ఉన్నపుడే కాసులొస్తాయి.. లేదంటే కథ కంచికే. అలాంటి చిన్న సినిమాలే 2023లో మ్యాజిక్ చేస్తున్నాయి. తాజాగా మా ఊరి పొలిమేర 2, కీడా కోలా సినిమాలకు మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్ చూసి ట్రేడ్ కూడా షాక్ అయిపోయింది.

పొలిమేర ఓటిటిలో హిట్ అవ్వడంతో.. సీక్వెల్‌కు అది బాగా కలిసొచ్చింది. టాక్‌తో సంబంధం లేకుండా తొలిరోజే దాదాపు 1.83 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. మరోవైపు కీడా కోలా కూడా ఫస్ట్ డే 3 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఈ రెండూ ఫస్ట్ వీకెండ్‌లోనే సేఫ్ అవ్వడం ఖాయం. మొన్నామధ్య మ్యాడ్ కూడా భారీ లాభాలు తీసుకొచ్చింది.

బేబీ కూడా ఇలాంటి సంచలనమే క్రియేట్ చేసింది. అంచనాల్లేకుండా వచ్చి 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మినహాయిస్తే స్టార్ హీరోలెవరూ 2023ని పెద్దగా వాడుకోలేదు. సమ్మర్ సీజన్‌ను పూర్తిగా వదిలేసారు. బేబీ, బలగం, విరూపాక్ష, సామజవరగమన, మ్యాడ్.. ఇలా చిన్న సినిమాలే ఆదుకుంటున్నాయి. ఇప్పుడు పొలిమేర 2, కీడా కోలా వంతు. మరి పెద్ద సినిమాలెప్పుడు బాక్సాఫీస్ దగ్గర విజృంభిస్తాయో..?




