Hi Nana: హాయ్ నాన్న నుంచి మూడో పాట విడుదలైంది. మృణాల్ ఠాకూర్, నాని పెళ్లి చేసుకున్నట్లు ఈ పాటలో రివీల్ చేసారు. తమ మూడో యానివర్సరీ కానుకగా తన భర్తకి ఓ సాంగ్ డేడికేట్ చేస్తూ స్టార్ట్ అయ్యిన ఈ సాంగ్ మెలోడియస్‌గా ఉంది. సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ మరోసారి మాయ చేసారు. నాని, మృణాళ్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది.