- Telugu News Photo Gallery Cinema photos Shilpa Shetty will re enter Tollywood with Mahesh Babu and NTR films
Shilpa Shetty: టాలీవుడ్ పై దృష్టి పెడుతోన్న సాగర కన్య.. ఆ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్.?
వెంకటేష్ తో సాహసవీరుడు సాగరకన్య.. మోహన్ బాబుతో వీడెవడండీ బాబు.. నాగార్జునతో ఆజాద్ సినిమాల్లో నటించిన శిల్పా శెట్టి బాలకృష్ణతో భలేవాడివి బాసు సినిమాలు చేసింది
Updated on: Oct 20, 2022 | 1:14 PM

ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది సన్నజాజి శిల్పాశెట్టి. శిల్పా శెట్టి అడపాదడపా సినిమాలు చేసినా బుల్లితెర మీద ఆమె సందడి చేస్తుంది.

బాలీవుడ్ సినిమాలే కాకుండా సౌత్ సినిమాలు అందులోనూ తెలుగు సినిమాల్లో కూడా నటించి ఇక్కడ ప్రేక్షకులను అలరించింది ముద్దుగుమ్మ శిల్పా శెట్టి.

వెంకటేష్ తో సాహసవీరుడు సాగరకన్య.. మోహన్ బాబుతో వీడెవడండీ బాబు.. నాగార్జునతో ఆజాద్ సినిమాల్లో నటించిన శిల్పా శెట్టి బాలకృష్ణతో భలేవాడివి బాసు సినిమాలు చేసింది

వయసు మీద పడుతున్నా కూడా అమ్మడు గ్లామర్ విషయంలో మేటి హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా ఉంది. బాలీవుడ్ లో 7 ఏళ్ల దాకా కెరియర్ గ్యాప్ ఇచ్చిన శిల్పా శెట్టి రీసెంట్ గా నికమ్మ హంగామా 2 సినిమాల్లో నటించింది

టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న సందర్భంగా మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలని చూస్తుంది శిల్పా శెట్టి. ఇప్పటికే మహేష్ త్రివిక్రం కాంబోలో వస్తున్న మూవీలో ఆమెని తీసుకున్నట్టు టాక్.

త్రివిక్రమ్ సినిమాలో శిల్పా శెట్టి ఫిక్స్ అయితే మాత్రం ఆమె పాపులారిటీకి తగిన పాత్ర ఇస్తారని ఆశించవచ్చు. ఇదేకాకుండా కొరటాల శివ తారక్ కాంబో సినిమాలో వస్తున్న ప్రాజెక్ట్ లో కూడా శిల్పా శెట్టి నటిస్తుందని కూడా అంటున్నారు.




