- Telugu News Photo Gallery Cinema photos Sandalwood actor puneeth Rajkumar rare childhood and marriage and family photos
Puneeth Rajkumar Death: చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి పవర్ స్టార్‌గా పునీత్ ప్రయాణం.. కన్నడనాట అంతులేని అభిమానులు అప్పు సొంతం..
కన్నడలో స్టార్స్‌గా రాణించిన హీరోలలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Updated on: Oct 29, 2021 | 5:13 PM

కన్నడలో స్టార్స్ గా రాణించిన హీరోలలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

చేసింది 29 సినిమాలే.. కానీ అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నారు పునీత్. అభిమానులు ఆయనను ముద్దుగా అప్పు అను పిలుచుకుంటారు.

పునీత్ హఠాన్మరణం యావత్ సినీలోకాన్ని విషాదంలోకి నెట్టింది.

జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో పునీత్ కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను విక్రమ్ హాస్పటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ పునీత్ తుది శ్వాస విడిచారు. పునీత్ మరణాన్ని వైద్యులు ప్రకటించడంతో అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్.

పునీత్ రాజ్‌కుమార్ 17 మార్చి 1975న జన్మించారు. నటుడు, నేపథ్య గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, నిర్మాత ఇలా తన ప్రతిభను చాటుకున్నాడు పునీత్.

బాలనటుడిగా పలు సినిమాలో నటించి ఆకట్టుకున్నారు పునీత్ రాజ్ కుమార్. నటుడిగానే కాదు సింగర్ గాను తన ప్రతిభను చాటుకున్నారు పునీత్.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా 12 సినిమాల్లో నటించారు ;పునీత్.. ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, పార్వతమ్మకు ఐదుగురు సంతానం వీరిలో పునీత్ రాజ్‌కుమార్ మూడో కుమారుడు

డిసెంబర్ 1,1999లో అశ్విని రేవంత్‌ను పెళ్ళి చేసుకున్నారు పునీత్ రాజ్ కుమార్.

పునీత్ రాజ్ కుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు దృతి, వందిత.





























