Rajeev Rayala |
Updated on: May 03, 2022 | 8:01 AM
ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
కేవలం టాలీవుడ్ లోనే కాకుండా మలయాళ, తమిళ ఇండస్ట్రీలలో కూడా సాయి పల్లవి స్టార్ డమ్ సొంతం చేసుకుంది.
ఇదే సమయంలో హిందీ ప్రేక్షకులను కూడా సాయి పల్లవి పలకరించి ఆకట్టుకుంది.
సాయి పల్లవి ఈమద్య కాలంలో ఏ ఒక్క సినిమాకు కూడా కమిట్ అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఇప్పుడు ఆమె అసలు సినిమాలే చేయడం లేదు ఎందుకు అంటూ అభిమానులు మదన పడుతున్నారు.
అయితే ఆమె త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతుందని వార్తలు కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల పై సాయి పల్లవి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాటిలో ఎలాంటి నిజం లేదు అని కొట్టిపారేస్తున్నారు.