- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna on Negativity Dealing with Trolls and Staying Positive
Rashmika Mandanna: అదే నా బలహీనత.. అందుకే బయటపడకూడదంటున్న నేషనల్ క్రష్
ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సెట్లో బిజీగా ఉండే రష్మిక మందన్న నెగటివిటీని ఎలా డీల్ చేస్తుంటారు? సోషల్ మీడియా ట్రోలింగ్ మనసు దాకా రాకుండా ఎలా సేఫ్ గా ఉంటారు.. ఇలా ప్రశ్నలు ఆమె అభిమానులకు ఎన్నెన్నో.. లేటెస్ట్ గా వాటినే అడ్రస్ చేశారు నేషనల్ క్రష్. ఆ డీటైల్స్ చూద్దాం. నెగటివిటీ సర్వత్రా ఉంటుంది. కానీ మనం ఫోకస్ చేయాల్సింది దేని మీదో మనకో క్లారిటీ ఉండాలంటున్నారు రష్మిక మందన్న.
Updated on: Aug 08, 2025 | 9:55 PM

నెగటివిటీ సర్వత్రా ఉంటుంది. కానీ మనం ఫోకస్ చేయాల్సింది దేని మీదో మనకో క్లారిటీ ఉండాలంటున్నారు రష్మిక మందన్న. వృత్తి పరంగా తీరిక లేకుండా ఉన్నానన్నారు.

ప్రయాణంపై దృష్టి పెట్టినప్పుడు, పక్క చూపులు ఉండవన్నది నేషనల్ క్రష్ చెబుతున్న మాట. సాటి మనుషుల పట్ల దయతో ప్రవర్తించినప్పుడు మన చుట్టూ పాజిటివిటీ ఉంటుందన్నారు మిస్ మందన్న.

సాటి మనుషుల్ని కాస్త ఊపిరి పీల్చుకోనిద్దాం. మనం ఎదగడం కోసం పక్కవాళ్ల గొంతు నొక్కక్కర్లేదన్నారు ఈ బ్యూటీ. ఈ ప్రపంచం చాలా పెద్దది.. మనందరికీ స్థలం ఉందన్నది రష్మిక నమ్మే సిద్ధాంతం.

బేసిగ్గా రష్మిక చాలా ఎమోషనల్ పర్సన్ అట. ఆమె చుట్టూ ఉన్నవాళ్లకి ఈ విషయం బాగా తెలుసట. అంత రియల్‌గా ఉంటారు కాబట్టే, అందరూ ఆమెని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తుంటారట. సేమ్ టైమ్ తనలోని భావోద్వేగాలను జనాల ముందు పెద్దగా ప్రదర్శించడానికి ఇష్టపడరట రష్మిక.

నటిగా సొసైటీలోకి వచ్చాక తన రియల్ ఎమోషన్స్ ని కూడా చాలా మంది ఫేక్ అనుకునే ప్రమాదం ఉందని, దాన్ని తన బలహీనతగా ఎవరూ చూడకూడదని.. అందుకే కొన్నిసార్లు గోప్యత తప్పదని అన్నారు రష్మిక.




