- Telugu News Photo Gallery Cinema photos Ram Pothineni and Puri Jagannadh double ismart movie pre market business increases after songs release Telugu Heroes Photos
Double ismart: ఇస్మార్ట్ శంకర్ హిట్ సౌండ్‌ని డబుల్ ఇస్మార్ట్ రిపీట్ చేస్తుందా.?
మార్ ముంత, చోడ్ చింత అని పూరి అండ్ టీమ్‌ని చూసి చెప్పే టైమ్ వచ్చేసిందా? డబుల్ ఇస్మార్ట్ పాటలే కాదు, జరుగుతున్న బిజినెస్ కూడా పాజిటివ్‌గానే వినిపిస్తోంది. ఏకంగా పుష్పరాజ్ అప్పుడెప్పుడో లాక్ చేసుకున్న టైమ్‌కి ల్యాండ్ కావడానికి రెడీ అవుతోంది డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ హిట్ సౌండ్‌ని డబుల్ ఇస్మార్ట్ రిపీట్ చేస్తుందా.? డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకి, పూరి కనెక్స్ట్ కీ మధ్య ఉన్న గత ఇష్యూలను పక్కనపెడితే..
Updated on: Jul 19, 2024 | 2:02 PM

మార్ ముంత, చోడ్ చింత అని పూరి అండ్ టీమ్‌ని చూసి చెప్పే టైమ్ వచ్చేసిందా? డబుల్ ఇస్మార్ట్ పాటలే కాదు, జరుగుతున్న బిజినెస్ కూడా పాజిటివ్‌గానే వినిపిస్తోంది.

ఏకంగా పుష్పరాజ్ అప్పుడెప్పుడో లాక్ చేసుకున్న టైమ్‌కి ల్యాండ్ కావడానికి రెడీ అవుతోంది డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ హిట్ సౌండ్‌ని డబుల్ ఇస్మార్ట్ రిపీట్ చేస్తుందా.?

డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకి, పూరి కనెక్స్ట్ కీ మధ్య ఉన్న గత ఇష్యూలను పక్కనపెడితే.. డబుల్ ఇస్మార్ట్ కి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగిందనే టాక్ వినిపిస్తోంది.

దాదాపు 50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని వార్తలు గట్టిగా వైరల్ అవుతున్నాయి. రామ్ కెరీర్‌లో మంచి నెంబర్ చూసిన సినిమాగా డబుల్ ఇస్మార్ట్ రికార్డు క్రియేట్ చేసుకుంటుందా.?

స్టార్టింగ్‌లో అంతంత మాత్రం బజ్‌తోనే సాగింది డబుల్ ఇస్మార్ట్ జర్నీ. కానీ పుష్ప2 రిలీజ్ కావాల్సిన ఆగస్టు 15 మీద ఖర్చీఫ్ వేసినప్పటి నుంచీ క్రేజ్ మొదలైంది.

విడుదలవుతున్న పాటలు కూడా సినిమా మీద హోప్స్ పెంచుతున్నాయి. కంటెంట్ కూడా ఇంతే జోరుగా ఉంటే మాత్రం సినిమా క్లిక్ కావడం ఖాయం అనే బజ్ స్ప్రెడ్ అవుతోంది. పడ్డ ప్రతిసారీ లేవడం డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్‌కి అలవాటే.

ఈ సారి ఆయన లేస్తే సరిపోదు, రామ్ కెరీర్‌ని కూడా లైన్లో పెట్టాలి. అప్పుడే బొమ్మ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది. ఫస్ట్ పార్టుకి ప్లస్ అయిన తెలంగాణ యాక్సెంట్, మాస్ కంటెంట్.. డబుల్ ఇస్మార్ట్ కి పే చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.





























