- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun and Sukumar Pushpa 2 movie postponed due to delay in post production work Telugu Heroes Photos
Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.! హీరో, డైరక్టర్ తలో దిక్కు..?
పుష్ప సీక్వెల్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్. హీరో అల్లు అర్జున్‌కీ, కెప్టెన్ సుకుమార్‌కీ గొడవైందా? అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేయడానికి రీజన్ ఏంటి? హీరో, డైరక్టర్ తలో దారిన ఎక్కడికి వెళ్లారు? ఇంతకీ ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమా రిలీజ్ అవుతుందా.? లేకుంటే నెక్స్ట్ ఇయర్‌కి వాయిదా పడుతుందా? సోషల్ మీడియా సెగ మామూలుగా లేదు మరి.. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్పరాజ్ టాపిక్కే. బన్నీ అసలు గడ్డం ఎందుకు తీసేశారు?
Updated on: Jul 19, 2024 | 1:27 PM

ఎన్ని రోజులైనా పర్లేదు.. ఎంత లేటైనా పర్లేదు అనుకున్నది వచ్చేవరకు తగ్గేదే లే అన్నట్లు ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. ఇక వాయిదాలేం లేవు.. డిసెంబర్ 6న కుమ్మేద్దాం అంటున్నారు పుష్ప 2 టీం.

అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో బిజీ బిజీగా నడుస్తుంది. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు సుకుమార్. డిసెంబర్ 6నే ఈ చిత్రం వస్తుందంటున్నారు మేకర్స్.

అసలే హ్యాట్రిక్ సక్సెస్ ఉన్న కాంబో కాబట్టి, ఈ సారి రంగంలోకి దిగితే రంగేళీ అద్దిరిపోవాలన్నది గురుజీ టార్గెట్. అద్భుతమైన కథకు ఫాంటసీని మిక్స్ చేసి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట త్రివిక్రమ్.

అక్కడికి కూడా ఒంటరిగా వెళ్లలేదు. లిరిక్ రైటర్ చంద్రబోస్‌ని వెంట పెట్టుకునే వెళ్లారు. అక్కడ ఖాళీ సమయంలో సంగీత చర్చలు సాగించాలన్నది మాస్టర్ వేసిన ప్లాన్.

ఇటలీకి ఫ్యామిలీతో ట్రిప్ వెళ్లాలన్నది కూడా బన్నీ సడన్‌గా తీసుకున్న డెసిషన్ కాదు. ఎప్పటి నుంచో అనుకున్నదే. కరెక్ట్ గా కుదిరింది కాబట్టి, కొన్నాళ్లు ట్రిప్‌కి వెళ్లారు. ఈ నెలాఖరుకు ఫ్రెష్ షెడ్యూల్ మొదలవుతుంది. ఆ టైమ్ కి ఫాహద్ ఫాజిల్ కూడా సెట్స్ కి జాయిన్ అవుతారు.

బన్నీ ట్రిమ్ చేసింది కూడా జస్ట్ రెండు పాయింట్లే. సో, ఈ నెలాఖరుకు ఆ మాత్రం గడ్డం పెరగడం కూడా పెద్ద విషయమేం కాదు. షెడ్యూల్ గ్యాప్ వచ్చేసరికి ఎవరికి వారు కహానీలు అల్లుకున్నారు కానీ, అందులో కించిత్తు కూడా నిజం లేదన్నది మేకర్స్ వైపు నుంచి వినిపిస్తున్న మాట.




