- Telugu News Photo Gallery Cinema photos Ram charan upasana visits mahesh babu house and tribute to indira devi photos
Mahesh Babu: మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి సంస్మరణ సభ.. రామ్ చరణ్ దంపతుల హాజరు
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, నటుడు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి (70) కన్నుమూయడం ఆ ఫామిలీని శోక సంద్రంలో నెట్టేసింది. మరణ వార్త తెలియగానే టాలీవుడ్ నుండి చాలామంది వ్యక్తిగతంగా వచ్చి, మహేష్ బాబుకి, కృష్ణకి తమ సంతాపం (Tribute) వ్యక్త పరిచారు.
Updated on: Oct 10, 2022 | 1:47 PM

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, నటుడు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి (70) కన్నుమూయడం ఆ ఫామిలీని శోక సంద్రంలో నెట్టేసింది.

మరణ వార్త తెలియగానే టాలీవుడ్ నుండి చాలామంది వ్యక్తిగతంగా వచ్చి, మహేష్ బాబుకి, కృష్ణకి తమ సంతాపం (Tribute) వ్యక్త పరిచారు.

ఇక రీసెంట్ గా మహేష్ బాబు తన తల్లికి 11వ రోజు కార్యక్రమాలు నిర్వహించగా.. నందమూరి బాలకృష్ణ స్వయంగా వెళ్లి కృష్ణ, మహేష్ బాబులను పలకరించి తన సంతాపం తెలిపారు.

తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు మహేష్ బాబు ఇంటికి వెళ్లారు.

మహేష్ తల్లి ఇందిరా దేవి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

అనంతరం కృష్ణ, మహేష్ బాబు ఫ్యామిలీతో కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తల్లిని కోల్పోయి బాధలో ఉన్న మహేష్ బాబును రామ్ చరణ్ ఓదార్చారు. అదేవిధంగా మహేష్ సతీమణి నమ్రత, కూతురు సితారలను ఓదార్చింది ఉపాసన.

అనారోగ్యంతో ఇందిరాదేవి మరణించడంతో మహేష్ బాబు కుటుంబం తీవ్రంగా కుంగిపోయింది.

మహేష్ బాబుతో పాటు ఆయన సతీమణి నమ్రత, కూతురు సితార కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మహేష్ బాబు తల్లి మరణించడంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆయన లేటెస్ట్ మూవీ చిత్ర షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది.

అతిత్వరలో ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదకు రావాలని ప్లాన్ చేస్తున్నారు మహేష్.




