- Telugu News Photo Gallery Cinema photos Rakshit Atluri and Komali's impressive performance in 'Sasivadane' teaser is heart touching
హృదయాన్ని హత్తుకునేలా ‘శశివదనే’ టీజర్.. ఆకట్టుకుంటోన్న రక్షిత్ అట్లూరి, కోమలీ పెర్ఫామెన్సెస్
‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి కోమలీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణను ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది.
Updated on: Jan 10, 2024 | 3:09 PM

‘శశివదనే’ సినిమా టీజర్‌ను మేకర్స్ గత బుధవారం విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అహ్లాదకరమైన ప్రేమకథలా ఉంది. హీరో (రక్షిత్ అట్లూరి), హీరోయిన్ (కోమలీ ) కోసం ఆమె ఇంటి దగ్గర వెయిట్ చేయటం, ఆమె కనపడకపోవటంతో ఆమెకు డిఫరెంట్‌గా సిగ్నల్ పంపటం సన్నివేశాలు వైవిధ్యంగా ఉన్నాయి. అలాగే హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి.

ఇక టీజర్ ఎండింగ్‌లో హీరో రక్షిత్ లుక్ చూస్తుంటే కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. అదేంటనేది మాత్రం తెలియకుండా దర్శక నిర్మాతలు సీక్రెట్‌ను మెయిన్‌టెయిన్ చేయటం చూస్తుంటే సినిమాలో హై మూమెంట్ ఏదో ఉందనే ఆసక్తి పెరుగుతోంది.

ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన మూవీ టైటిల్ సాంగ్ ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’ అనే సాంగ్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదలైన టీజర్ ఈ అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళుతుంది. నిర్మాణాంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న శశివదనే చిత్రం ట్రైలర్, రిలీజ్ డేట్‌పై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు.

శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు.