- Telugu News Photo Gallery Cinema photos Rajinikanth Vettaiyan shooting going on, Akshay Kumar new movie may have Kiara Advani or Keerthy Suresh
Tollywood News: సూపర్ స్పీడ్ అందుకున్న తలైవా నయా సినిమా | ఇరువురు భామల మధ్యలో అక్షయ్
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా వేట్టయన్. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రజనీకాంత్ పార్ట్ షూటింగ్ పూర్తయిందని ప్రకటించారు మేకర్స్. చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ ఇంతకు మునుపు ఎప్పుడూ కనిపించనటువంటి వైవిధ్యమైన కేరక్టర్‌లో కనిపిస్తారని టాక్. అక్షయ్‌కుమార్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. హారర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమాను రూపొందించనున్నారు.
Updated on: May 15, 2024 | 4:37 PM

Vettaiyan: రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా వేట్టయన్. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రజనీకాంత్ పార్ట్ షూటింగ్ పూర్తయిందని ప్రకటించారు మేకర్స్. చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ ఇంతకు మునుపు ఎప్పుడూ కనిపించనటువంటి వైవిధ్యమైన కేరక్టర్‌లో కనిపిస్తారని టాక్.

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ మరోసారి ఫెయిల్ అయ్యారు. సౌత్‌లో సూపర్ హిట్ అయిన కంటెంట్‌తో చేసిన మూవీ కూడా డిజాస్టర్ కావటంతో.. అక్కీ మార్కెట్ స్టామినా మీదే అనుమానాల మొదలయ్యాయి.

GV Prakash: తానూ, సైంధవి విడిపోతున్నట్టు ప్రకటించారు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్. 11 ఏళ్ల వైవాహిక జీవితానికి వీడ్కోలు చెబుతున్నామని అన్నారు. ఇద్దరి మానసిక ప్రశాంతత కోసం, ఎదుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తమ నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని, ప్రైవసీ ఇవ్వాలని కోరారు జీవీ ప్రకాష్.

Pushpa 02: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప2. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు ఫాహద్ ఫాజిల్. ఆగస్టు 15న విడుదల కానుంది పుష్ప2. ఈ సినిమా కోసం ఫాహద్ బల్కీ డేట్స్ ఇచ్చారట. జూన్ ఒకటో తేదీ నుంచి కంటిన్యుయస్‌గా పుష్ప సెట్స్ లోనే ఉంటారట. ఫాహద్ దాదాపు రెండు వారాల పాటు కాల్షీట్ కేటాయించినట్టు సమాచారం.

Baby John: వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న సినిమా బేబీ జాన్. కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అట్లీ, జియో స్టూడియోస్ సమర్పిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టానని అన్నారు నటుడు వరుణ్ ధావన్. తమిళంలో సూపర్‌డూపర్ హిట్ అయిన తెరి సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోంది బేబీ జాన్.




