- Telugu News Photo Gallery Cinema photos Producer Dil raju clarity on Ram charan Game Changer movie release on September 2024 Telugu Heroes Photos
Ram Charan: రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు.. ఎప్పుడంటే.?
గేమ్ చేంజర్ రిలీజ్‌కు సంబంధించి షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత దిల్‌రాజు. దాదాపు రెండేళ్లుగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లేశారు. ఇంతకీ దిల్ రాజు ఏం చెప్పారు..? అనుకుంటున్నారా..? హావ్ ఎ లుక్. ట్రిపులార్ లాంటి బిగ్ హిట్ తరువాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా ఆడియన్స్ ముందుకు రాలేదు.
Updated on: Jan 03, 2024 | 9:09 PM

గేమ్ చేంజర్ రిలీజ్‌కు సంబంధించి షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత దిల్‌రాజు. దాదాపు రెండేళ్లుగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లేశారు. ఇంతకీ దిల్ రాజు ఏం చెప్పారు..? అనుకుంటున్నారా..?

హావ్ ఎ లుక్. ట్రిపులార్ లాంటి బిగ్ హిట్ తరువాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా ఆడియన్స్ ముందుకు రాలేదు.

దీంతో చరణ్ ఫ్యాన్స్ మెగా మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా ఆలస్యం విషయంలో శంకర్ మీద గుర్రుగా ఉన్నారు ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి మాట్లాడిన నిర్మాత దిల్‌రాజు.. అభిమానులకు షాక్ ఇచ్చారు.

గేమ్ చేంజర్ 2024 సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతుందన్నారు నిర్మాత. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఇప్పటికే చరణ్ కెరీర్లో లాంగ్ గ్యాప్ వచ్చిందంటున్న ఫ్యాన్స్... మరో ఏడాది వెయిట్ చేయాలా అని ఫీల్ అవుతున్నారు.

గేమ్ చేంజర్ సెట్స్ మీద ఉండగానే గతంలో ఆగిపోయిన ఇండియన్ 2ను కూడా లైన్‌లో పెట్టారు శంకర్. రెండు సినిమాల షూటింగ్స్ ప్యారలల్‌గా ప్లాన్ చేసిన దర్శకుడు ఇండియన్ 2 మీద ఎక్కువగా దృష్టి పెట్టారన్న కంప్లయింట్స్ వినిపించాయి.

అందుకే గేమ్ చేంజర్ ఆలస్యమవుతుందన్నది మెగా అభిమానుల మెయిన్ పాయింట్. ఆ మధ్య ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నట్టుగా చేసి వెంటనే ఆపేశారు. దసరా సందర్భంగా ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు.

హమ్మయ్య ప్రమోషన్ స్టార్ట్ అవుతుందని సంతోషించే లోపే.. ఆ అప్‌డేట్‌ను నిరవధికంగా వాయిదా వేసింది యూనిట్. దీంతో ఫ్యాన్స్ వైపు నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ నెగెటివిటీని గేమ్ చేంజర్ టీమ్ ఎలా డీల్ చేస్తుందో చూడాలి.




