- Telugu News Photo Gallery Cinema photos Prabhas Salaar and SRK Dunki movies each targeting 1000 crores at boxoffice individually
Salaar vs Dunki: ఈ వారం బాక్సాఫీస్ టార్గెట్ రెండు వేల కోట్లు
శుక్రవారం సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి అంటే, ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చనే మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ వారం మాత్రం ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయొచ్చనే డిస్కషన్ షురూ అయింది. సలార్ వర్సెస్ డంకీ ఫైట్‌లో ముందు మిగిలేదెవరు? కమాన్ లెట్స్ వాచ్. ప్రభాస్‌కి హిట్ కావాలి. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న ఆ హిట్ కావాలి. బాహుబలిని మించే హిట్ కావాలి. ఆ హిట్ సలార్‌తో వస్తుందా? ఇద్దరు మిత్రుల మధ్య జరిగే కథలు మన దగ్గర ఎప్పుడూ కాసులు కురిపించినవే.
Updated on: Dec 20, 2023 | 1:06 PM

శుక్రవారం సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి అంటే, ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చనే మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ వారం మాత్రం ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయొచ్చనే డిస్కషన్ షురూ అయింది. సలార్ వర్సెస్ డంకీ ఫైట్‌లో ముందు మిగిలేదెవరు? కమాన్ లెట్స్ వాచ్...

ప్రభాస్‌కి హిట్ కావాలి. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న ఆ హిట్ కావాలి. బాహుబలిని మించే హిట్ కావాలి. ఆ హిట్ సలార్‌తో వస్తుందా? ఇద్దరు మిత్రుల మధ్య జరిగే కథలు మన దగ్గర ఎప్పుడూ కాసులు కురిపించినవే. మరి అదే సెంటిమెంట్ ఇప్పుడు డార్లింగ్ కెరీర్‌కి కలిసొస్తుందా? ఎన్నెన్నో చర్చల మధ్య ఈ నెల 22న రిలీజ్‌కి రెడీ అవుతోంది సలార్.

ప్రభాస్ హిట్ కోసం చూస్తుంటే, షారుఖ్ హ్యాట్రిక్ కోసం తాపత్రయపడుతున్నారు. ఆల్రెడీ ఈ ఇయర్ మొత్తం యాక్షన్ చూసేశారు, ఈ నెల 21న సోషల్ సెటైర్‌ని విట్‌నెస్ చేయండి అంటూ డంకీ గురించి ఇష్టంగా ప్రమోట్ చేస్తున్నారు.

ఆల్రెడీ ఈ ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలను ఇచ్చిన క్రెడిట్ షారుఖ్ సొంతం చేసుకున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంతకు మునుపు ఏ హీరోకీ లేని క్రెడిట్ అది. ఇప్పుడు డంకీతో మూడో వెయ్యి కోట్లు కూడా అందుకున్నారంటే షారుఖ్ రికార్డులను బద్ధలు కొట్టడం ఇప్పుడప్పుడే ఏ హీరోకీ సాధ్యం కాదేమో.

మన వాళ్లు ఇద్దరు పోటీ పడుతున్న ఈ వారమే, హాలీవుడ్ నుంచి ఆక్వామాన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్ రిలీజ్ అవుతోంది. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్న ఈ సినిమాకు మన దగ్గర కూడా మంచి బజ్ ఉంది.




