- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan Ustaad Bhagat Singh to Prasanth Varma Mahakali latest movie updates from Tollywood
Tollywood Updates: పవన్ ఉస్తాద్ షూట్ రీస్టార్ట్.. సెట్స్‌పైకి మరో పీవీసీయూ మూవీ..
ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఎనౌన్స్ చేసిన మహాకాళి అప్‌డేట్. జై హనుమాన్ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్. హాలీవుడ్ థ్రిల్లర్ ఫైనల్ డెస్టిషన్ సిరీస్ నుంచి మరో మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. బాలకృష్ణ నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
Updated on: May 14, 2025 | 1:50 PM

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ రోజు నుంచి ఓజీ షూట్‌లో జాయిన్ అవుతున్న పవన్, జూన్ నుంచి ఉస్తాద్‌కు డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు పవన్.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఎనౌన్స్ చేసిన మహాకాళి షూటింగ్ ప్రారంభమైంది. తెలుగులో తొలి సూపర్ ఉమెన్ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీకి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. బెంగాల్ నేపథ్యంలో జరిగే కథగా ఈ సినిమా తెరకెక్కనుంది. తెలుగుతో పాటు మరికొన్ని భారతీయ భాషలు, విదేశీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

జై హనుమాన్ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఈ సినిమా ప్రొడక్షన్‌లో భాగస్వామిగా చేరినట్టుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు నార్త్‌లో భూషణ్ కుమార్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకుడు, రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు.

బాలకృష్ణ నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. రీసెంట్‌గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో బిగ్ హిట్ అందుకున్న అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 మూవీలో నటిస్తున్నారు బాలయ్య.

హాలీవుడ్ థ్రిల్లర్ ఫైనల్ డెస్టిషన్ సిరీస్ నుంచి మరో మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సిరీస్‌లో 14 ఏళ్ల తరువాత వస్తున్న మూవీ కావటంతో 'ఫైనల్ డెస్టినేషన్ : బ్లడ్ లైన్స్' మీద భారీ అంచనాలు ఉన్నాయి. మే 16న రిలీజ్ కానున్న ఈ సినిమాకు కాస్త ముందుగానే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. మే 15 అర్ధరాత్రి నుంచే సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.



















