- Telugu News Photo Gallery Cinema photos Once again a huge gap for Megastar Chiranjeevi Next Movie details here Telugu Heros Photos
Megastar Chiranjeevi: బాస్ కి మరోసారి భారీ గ్యాప్ తప్పేలా లేదు.. చిరు నెక్స్ట్ మూవీ ఎప్పుడు..?
అనుకున్నది అనుకున్నట్లు జరగడానికి ఇదేం సినిమా కాదు.. అక్కడంటే స్క్రిప్ట్ రాసినట్లుగా ముందుకెళ్తుంది కథ. కానీ రియల్ లైఫ్ అలా కాదుగా.. అందుకే అనుకునేదొక్కటి అయితే.. అక్కడ జరుగుతున్నది మరోటి. పాపం చిరంజీవి విషయంలోనే ఇది రిపీట్ అవుతుంది. మరి ఆయనకు వచ్చిన కష్టమేంటి..? మెగాస్టార్ విషయంలోనే సీన్ ఎందుకు రివర్స్‌లో జరుగుతుంది..? పాపం ప్రతీ సినిమాతో సిక్స్ కొట్టాలనే బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు చిరంజీవి.
Updated on: Sep 30, 2023 | 6:18 PM

అనుకున్నది అనుకున్నట్లు జరగడానికి ఇదేం సినిమా కాదు.. అక్కడంటే స్క్రిప్ట్ రాసినట్లుగా ముందుకెళ్తుంది కథ. కానీ రియల్ లైఫ్ అలా కాదుగా.. అందుకే అనుకునేదొక్కటి అయితే.. అక్కడ జరుగుతున్నది మరోటి.

పాపం చిరంజీవి విషయంలోనే ఇది రిపీట్ అవుతుంది. మరి ఆయనకు వచ్చిన కష్టమేంటి..? మెగాస్టార్ విషయంలోనే సీన్ ఎందుకు రివర్స్‌లో జరుగుతుంది..? పాపం ప్రతీ సినిమాతో సిక్స్ కొట్టాలనే బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు చిరంజీవి.

కానీ ఏదో ఒక సినిమా తగులుతుంది మిగిలినవి దారుణంగా బెడిసి కొడుతున్నాయి. ఈ మధ్యే భోళా శంకర్ ఇచ్చిన షాక్‌తో రీమేక్స్‌కు బ్రేక్ ఇచ్చి.. స్ట్రెయిట్ స్టోరీస్ చేయాలని ఫిక్స్ అయిపోయారు మెగాస్టార్. ఈ క్రమంలోనే కళ్యాణ్ కృష్ణను కూర్చోబెట్టి.. వశిష్టను లైన్‌లోకి తీసుకొచ్చారు చిరు.

సైరా తర్వాత మూడేళ్లు బ్రేక్ రావడంతో.. ఇకపై వరస సినిమాలు చేస్తానంటూ మాటిచ్చారు చిరు. అన్నట్లుగానే 2022 సమ్మర్ నుంచి 2023 ఆగస్ట్‌లోపు ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్‌లతో వచ్చారు. అందులో వాల్తేరు వీరయ్య మాత్రమే హిట్ కాగా.. మిగిలిన మూడు అంచనాలు అందుకోలేదు.

దాంతో ఇకపై ఫాస్ట్ మంత్రం పక్కనబెట్టి నిదానమే ప్రధానం అంటున్నారు. ఫాస్టుగా సినిమాలు చేయాలని చిరు కూడా అనుకున్నారు కానీ కళ్యాణ్ కృష్ణ సినిమా హోల్డ్‌లో ఉంది. వశిష్ట ప్రాజెక్ట్ ఫాంటసీ డ్రామా కావడంతో కనీసం ఏడాదైనా పడుతుంది.

డిసెంబర్ నుంచి ఇది సెట్స్‌పైకి రానుంది. ఈ లెక్కన 2024లో చిరు నుంచి సినిమాలు రానట్లే. అన్నీ కుదిర్తే 2025 సంక్రాంతికి వశిష్ట సినిమాతో రానున్నారు చిరు. అంటే మెగా స్పీడ్‌కు బ్రేక్స్ పడినట్లే.




