- Telugu News Photo Gallery Cinema photos New Movie Updates in Tollywood trending film news on August 14th telugu cinema news,
Tollywood: కొత్త చిత్రాల ముచ్చట్లు.. టాలీవుడ్ టాప్ ట్రెండింగ్ టాపిక్స్ ఇవే..
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా దేవర. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా దీనికి పాటలు రాయడం మొదలు పెట్టారు రామజోగయ్య శాస్త్రి. ఇదే విషయం ట్వీట్ చేసారు. సినిమా ఎప్రిల్ 2024, 5న విడుదల కానుంది. ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు.
Updated on: Aug 14, 2023 | 7:46 PM

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఎప్రిల్ 5, 2024న విడుదల కానుంది దేవర.ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా సమ్మర్ రేసులోనే ఉంది.

Naveen Polisetty: బ్రాండ్ అంబాసిడర్.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి. ఈయన హీరోగా చాలా బిజీగా ఉన్నారిప్పుడు. వరసగా సినిమాలు చేస్తూనే.. తాజాగా బ్రాండ్ అంబాసిడర్‌గానూ అడుగు పెడుతున్నారు. ఈయన ఫేమస్ క్లాత్ బ్రాండ్ ట్విల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు.

Mr Pregnant: మిస్టర్ ప్రగ్నెంట్.. బిగ్ బాస్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సోహెల్. ఈయన ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నారు. అలా చేస్తున్న సినిమానే మిస్టర్ ప్రెగ్నెంట్. రూప కొడువయార్ హీరోయిన్‌గా కొత్త దర్శకుడు శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సినిమా మిస్టర్ ప్రగ్నెంట్. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 18న విడుదల కానుంది. తాజాగా ఇందులోంచి ఉల్టా పల్టా సాంగ్ మీడియా ప్రతినిథుల చేతుల మీదుగానే విడుదలైంది.

DD Returns: ఇట్స్ సంతానం టైమ్.. సంతానం, సురభి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా'. DD రిటర్న్స్ పేరుతో తమిళంలో జులై 29న విడుదలైంది ఈ చిత్రం. దీనిని తెలుగులో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ 'డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా' పేరుతో ఆగస్ట్ 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో యూనిట్ తెలుగు ట్రైలర్‌ని లాంచ్ చేసింది.

Hebah Patel: మనసే మరల.. కుమారి 21 ఎఫ్ ఫేమ్ హెబ్బా పటేల్ హీరోయిన్‌గా వస్తున్న లేటెస్ట్ సినిమా ‘సందేహం’. ‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి మనసే మరలా అంటూ సాగే పాటను విడుదల చేసారు. ఎస్పీ చరణ్ దీన్ని ఆలపించారు.




