- Telugu News Photo Gallery Cinema photos Netizens are discussing about Tamannaah special song in Jailer movie
Tamannaah Bhatia: తమన్నా అందాలు అదరహో కానీ ఆ అమ్మడు అంతాకాదు అంటున్నారే..
హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తోంది . గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు శ్రీను సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.
Updated on: Jul 08, 2023 | 8:04 PM

టాలీవుడ్ లో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది తమన్నా. ఆతర్వాత ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి.దాంతో బాలీవుడ్ లో ఛాన్స్ లు అందుకుంటుంది.

బాలీవుడ్ లో ఈ అమ్మడు వెబ్ సిరీస్ లు చేస్తూ అలరిస్తోంది. బోల్డ్ సీన్స్ లోనూ నటిస్తూ రచ్చ చేస్తోంది ఈ చిన్నది.

హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తోంది . గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు శ్రీను సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.

అలాగే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్టెప్పులేసి అదరగొట్టింది. ఈ భామ ఇక ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. తాజాగా ఈ మూవీ సాంగ్ ను రిలీజ్ చేసింది.

తమన్నా ఈ పాటలో తన అందాలతో అదరగొట్టింది. అదిరిపోయే స్టెప్పులతో కవ్వించింది ఈ మిల్కీ బ్యూటీ. పుష్ప సినిమాలో సామ్ చేసిన సాంగ్ తో తమన్నా సాంగ్ ను పోలుస్తున్నారు నెటిజన్స్.

తమన్నా సమంతను మ్యాచ్ చేయలేకపోయిందని అంటున్నారు. కొందరు నెటిజన్లు. తమన్నా అందాలు ఆకట్టుకున్నప్పటికి.. సామ్ అంత బాగా చేయలేదు అంటున్నారు కొందరు.




