- Telugu News Photo Gallery Cinema photos Yash Rocking entry In Malaysia with full style And Grandly Welcomed By Malaysians
Yash: రాకీ భాయ్ మలేషియా వెళ్లింది కొత్త సినిమా షూట్ కోసం కాదా? ఫొటోస్ వైరల్
యశ్ తన స్నేహితులతో కలిసి ఓ ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్‌లో మలేషియా వెళ్లాడు. అయితే కొత్త సినిమా కోసం మలేషియా వెళ్లాడని చాలామంది భావించారు.
Updated on: Jul 08, 2023 | 5:25 PM

కేజీఎఫ్ ఫేమ్ హీరో యశ్ అకస్మాత్తుగా మలేషియాలో ల్యాండ్ అయ్యారు . అక్కడ అభిమానులు, ఫాలోవర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

యశ్ తన స్నేహితులతో కలిసి ఓ ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్‌లో మలేషియా వెళ్లాడు. అయితే కొత్త సినిమా కోసం మలేషియా వెళ్లాడని చాలామంది భావించారు.

అయితే గోల్డ్ షోరూమ్‌ని ప్రారంభించేందుకు యశ్ మలేషియా వెళ్లారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మలేషియాలోని భారతీయులు, అలాగే కన్నడిగులు యష్‌ను కలిసేందుకు పోటీ పడ్డారు.

ఈ సందర్భంగా చాలామంది రాకీ భాయ్‌తో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఒక కళాకారుడు యశ్ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఇతర కుటుంబ సభ్యులతో కూడిన చిత్ర పటాన్నిహీరోకు బహుమతిగా అందజేశాడు.

కాగా కేజీఎఫ్2 తర్వాత తన తర్వాతి ప్రాజెక్టును ప్రకటించలేదు యష్. అయితే ఓ లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయవచ్చంటూ వార్తలొచ్చాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




