OG Movie : ఓజీలో గ్లామర్ బ్యూటీ స్పెషల్ సాంగ్.. కన్ఫార్మ్ చేసిన హీరోయిన్.. ఇక థియేటర్లలో రచ్చ రచ్చే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా ఓజీ ఒకటి. దసరా కానుకగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూవీ పై భారీ హైప్ నెలకొంది. దీంతో ఇటీవల కొన్ని రోజులుగా ఈ మూవీ అప్డేట్స్, సాంగ్స్ రివీల్ చేస్తు్న్నారు మేకర్స్.
Updated on: Sep 14, 2025 | 6:13 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో ఓ గ్లామర్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయనుంది.

సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈమూవీ గురించి రోజుకో అప్డేట్, న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈసినిమాలో డిజే టిల్లు మూవీ హీరోయిన్ నేహా శెట్టి స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నేహా శెట్టి మాట్లాడుతూ.. త్వరలోనే ఓజీ మూవీతో మీ ముందుకు వస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరోవైపు ఈ బ్యూటీ చేసిన మాటలు పవన్ అభిమానులకు కిక్కిస్తున్నాయి. అయితే ఓజీలో స్పెషల్ పాటతోపాటు మరికొన్ని కీలక సన్నివేశాల్లోనూ ఈ అమ్మడు నటించనుందట. అయితే ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హాష్మీ, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వచ్చిన నేహా ఓజీ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

త్వరలోనే తన కొత్త సినిమాలకు సంబంధించిన అఫీషియల్ ప్రకటనలు రాబోతున్నాయని.. కానీ అన్నింటి కంటే ముందు ఓజీ సినిమాతో మీ ముందుకు వస్తానంటూ చెప్పుకొచ్చింది. ఓజీలో సర్పైజింగ్ రోల్ చేస్తానని తెలిపింది. పవన్ కళ్యాణ్ తనకు మంచి సన్నివేశాలు ఉన్నాయని తెలిపింది. చాలా రోజులుగా ఈ బ్యూటీ ఇండస్ట్రీలో సైలెంట్ అయిన సంగతి తెలిసిందే.




