- Telugu News Photo Gallery Cinema photos Can You Guess this Actress Who Waiting For Crazy Break In Telugu Industry, She Is Simran Chaudhary
Tollywood : బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న గ్లామర్ హీరోయిన్.. అందాలతో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. ఎవరంటే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. నటిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ సరైన ఆఫర్స్,బ్రేక్ అందుకోని తారల గురించి చెప్పక్కర్లేదు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.
Updated on: Sep 14, 2025 | 6:19 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న అందాల ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.. ? తెలుగులో క్రేజీ హీరోయిన్. గ్లామర్ డోస్ పెంచేసి వరుస ఫోటోషూట్లతో నెట్టింట అగ్గి రాజేస్తుంది. అయినా ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. కానీ ఇప్పుడు ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోలతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి. ప్రస్తుతం ఈ బ్యూటీ క్యాజువల్ లుక్ ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ నగరానికి ఏమైంది సినిమాతో కథానాయికగా సినీరంగానికి పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ వయ్యారి.

ఈ సినిమా తర్వాత తెలుగు సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఇప్పటివరకు పలు చిత్రాలతో మెప్పించింది. అయినా సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోయింది. తన నటనతో స్క్రీన్ ప్రెజన్స్ తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంది ఈ వయ్యారి. మోడలింగ్ రంగంలోకిఅడుగుపెట్టి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది.

మోడల్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. ఇప్పుడు కథానాయికగా రాణిస్తుంది. మరోవైపు నెట్టింట యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఆమె ఫిట్నెస్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు జనాలు.

అటు ట్రెడిషనల్.. ఇటు గ్లామర్ లుక్స్ లో ఆకట్టుకుంటున్న సిమ్రాన్.. ఫిట్నెస్ పై ఫోక్స చేస్తూ నటనకు తగిన ప్రాధాన్యత ఇస్తూ.. కంటెంట్ బలంగా ఉండే పాత్రలను ఎంచుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.




