- Telugu News Photo Gallery Cinema photos Janhvi Kapoor's Bollywood Struggle and Telugu Success A Career Analysis
Jahnvi Kapoor: బ్యాడ్‌లక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జాన్వీ కపూర్.. ఇక్కడ కాదు.. అక్కడ..
బ్యాడ్‌లక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు జాన్వీ కపూర్. అదేంటి అలా అంటున్నారు.. తెలుగులో పెద్ది సినిమా చేస్తుంది.. దాంతో పాటు ఇంకొన్ని పెద్ద సినిమాలు చేతిలో ఉన్నాయి కదా అనుకుంటున్నారేమో..? కానీ ఎన్ని సినిమాలు చేస్తున్నామనేది కాదు.. హిట్లు వచ్చాయా లేదా అనేది మ్యాటరిక్కడ. అందులో జాన్వీ బాగా వెనకబడిపోయారు.
Updated on: Sep 14, 2025 | 9:09 PM

తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. కానీ కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్నారు జాన్వీ కపూర్. దేవర సినిమాలో తంగం పాత్రతో బాగానే చేరువయ్యారు ఈ బ్యూటీ. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్నారు.

బాలీవుడ్ కంటే తెలుగులోనే ఈ భామకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. పెద్దితో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేరిపోవాలని చూస్తున్నారు జాన్వీ.తెలుగులో ఎలా ఉన్నా.. హిందీలో మాత్రం ఇప్పటికీ స్ట్రగ్లింగ్ స్టేజ్‌లోనే ఉన్నారు జాన్వీ.

అక్కడ ఎంట్రీ ఇచ్చి ఏడేళ్లు దాటినా.. ఇప్పటికీ ఒక్క హిట్ అంటూ వేచి చూస్తూనే ఉన్నారు జాన్వీ. గుంజన్ సక్సేనా, రూహీ లాంటి ఒకటి రెండు సినిమాలు పేరు తెచ్చాయి కానీ స్టార్ హీరోయిన్ హోదా మాత్రం తీసుకురాలేదు.

మొన్నొచ్చిన పరమ్ సుందరి సైతం ఫ్లాపే.కాంట్రవర్సీల మధ్య విడుదలైన పరమ్ సుందరికి అవేం పెద్దగా హెల్ప్ అవ్వలేదు. కలెక్షన్స్ 50 కోట్లు కూడా దాటలేదు.

ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో సన్నీ సంస్కారిలో నటిస్తున్నారు జాన్వీ. ఈమె కెరీర్‌కు అత్యంత కీలకంగా మారింది ఈ చిత్రం. ఇక పెద్ది హిట్టైతే జాన్వీ కెరీర్‌కు తెలుగులో తిరుగులేనట్లే.. వరసగా ఆఫర్స్ క్యూ కడతాయి.




