ఓరీ దేవుడో నాని అసలు పేరు ఇదా.. ఇన్ని రోజులు తెలియకపాయే..
నేచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువే. సో లోగా ఎంట్రీ ఇచ్చి, స్టార్‌గా మారిపోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాని, నేడు వరస సినిమాలో ఫుల్ బిజీ అయిపోయారు. అయితే తాజాగా ఈ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇంతకీ అది ఏంటీ అనుకుంటున్నారా? అందరూ మెచ్చే మన హీరో నాని అసలు పేరు అది కాదంట. తన రియల్ నేమ్ ఇదే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో తెలుసుకుందాం.
Updated on: Feb 27, 2025 | 10:33 AM

తన సహజమైన నటన, స్మైల్‌తో చాలా మంది అభిమానులను సంపాదించుకున్న హీరో నాని. ఈయనంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కు చాలా ఇష్టం. ఇక అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొన్ని సినిమాలకు పనిచేసిన నానికి అదృష్టం తలుపు తట్టడంతో అనుకోకుండా హీరోగా మారి, బ్లాక్ బస్టర్ హిట్స్‌తో స్టార్‌గా ఎదిగాడు.

అష్టా చమ్మ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. తర్వాత ఈగ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తర్వాత వరసగా సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకున్నాడు.

మొదట్లో లవర్‌బాయ్‌గా కనిపించిన ఈ హీరో దసరా మూవీతో మాస్ హీరోగా మారి, తన నటతో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాలో నాని నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

ఇక ఇటు హీరోగా చేస్తూనే, మరోవైపు నిర్మాతగా మారి, వరసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. మరీ ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న ఈ హీరో ఇప్పుడు ఏకంగా, మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిచడం చిన్న విషయం కాదు.

అయితే ఈ హీరో అసలు పేరు ఇది కాదంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నాని అసలు పేరు నవీన్ బాబు అంట. ఈయన ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత తన పేరు నానిగా మార్చుకున్నట్లు సమాచారం.