Paradise: ట్రాక్ మార్చి రిస్క్ చేస్తున్న నాని.. ఇంతకీ న్యాచురల్ స్టార్ ఏం చేసాడంటే
నాని కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నారా..? అదేంటి.. వరస విజయాలతో పాటు 100 కోట్ల సినిమాలిస్తున్న హీరోను పట్టుకుని ఈ ప్రశ్నేంటి అర్థం లేకుండా అనుకోవచ్చు. కానీ నాని నిర్ణయాలు చూస్తుంటే ఫ్యాన్స్‌కు ఈ అనుమానాలే వస్తున్నాయిప్పుడు. కానీ నాని ఏం చేసినా ఆలోచించే చేస్తాడులే అంటూ సపోర్ట్ చేస్తున్నారు కూడా. ఇంతకీ న్యాచురల్ స్టార్ ఏం చేస్తున్నారు..?
Updated on: Aug 13, 2025 | 7:26 PM

నానిని ఇలా పక్కింటి అబ్బాయిలా చూడటమే అలవాటు చేసుకున్నారు ఆడియన్స్. ఏమండోయ్ నానిగారూ అని పిలిస్తే.. ఆ అంటూ పలికేంత దగ్గరగా ఉంటాయి ఆయన పాత్రలు.

కానీ ఇప్పుడాయన మారిపోయారు.. మాస్ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరమైపోతున్నారు.. నాని సినిమా చూడాలంటే పిల్లలకు నో ఎంట్రీ ఇప్పుడు. హింసతో పాటే మార్కెట్ కూడా పెరిగిపోతుంది.

మొన్నొచ్చిన హిట్ 3లో ఊహించని వయోలెన్స్ చూపించారు న్యాచురల్ స్టార్. యానిమల్‌కే బాప్‌లా ఉంటుంది ఈ సినిమా సెకండాఫ్‌లోని హింస. అర్జున్ సర్కార్ పాత్రను అంత సీరియస్‌గా తీసుకున్నారు నాని.

ఇక ఇప్పుడు ప్యారడైజ్ టీజర్, లుక్స్ చూస్తుంటే అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో అంచనాలు మరింత పెంచేసింది. ప్యారడైజ్ లుక్స్, ఆ మేకింగ్ చూస్తుంటే నాని దెబ్బకు టైర్ 1 లిస్టులో చేరిపోయేలా ఉన్నారు.

ఇప్పటి వరకు ఈయన్ని మీడియం రేంజ్ హీరోగానే చూస్తున్నారు.. కానీ ప్యారడైజ్‌తో తనను తాను ప్రమోట్ చేసుకునేలా ఉన్నారు నాని. 200 కోట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారీయన. ఇది పూర్తిగా ఏ సర్టిఫికేట్ సినిమానే.. మార్చ్ 26, 2026న విడుదల కానుంది ప్యారడైజ్. మరి ఈ సినిమాతో నాని ఏం చేయబోతున్నారో చూడాలిక..?




