సీక్వెల్స్ తో నందమూరి హీరోలకు హిట్ దక్కేనా ?? పూర్తి వివరాలు ఇవే

అన్నీ విషయాలనూ కూడబలుక్కోవాల్సిన పని లేదు. కొన్నిసార్లు ఎవరికి వారే మొదలుపెట్టినా, అన్నీ ఒకే ట్రాక్‌ మీద ఉన్నట్టే కనిపిస్తాయి. ఇప్పుడు నందమూరి బాబాయ్‌, అబ్బాయిల మధ్య కూడా ఇలాంటి ఓ కామన్‌ పాయింట్‌ కనిపిస్తోంది. సక్సెస్‌ఫుల్‌ ప్రాజెక్టులను కొనసాగించడంలో అందరూ ఒకే మాట మీదే ఉన్నారు. ఆ డీటైల్స్ మీద ఓ లుక్‌ వేసేద్దాం పదండి... అఖండ సినిమాను ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. బాలయ్యలోని మాస్‌ యాంగిల్‌ మాత్రమే కాదు, కమర్షియల్‌ యాంగిల్‌ని కూడా సరికొత్తగా డిఫైన్‌ చేసిన సినిమా అఖండ.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Jan 14, 2024 | 5:38 PM

అన్నీ విషయాలనూ కూడబలుక్కోవాల్సిన పని లేదు. కొన్నిసార్లు ఎవరికి వారే మొదలుపెట్టినా, అన్నీ ఒకే ట్రాక్‌ మీద ఉన్నట్టే కనిపిస్తాయి. ఇప్పుడు నందమూరి బాబాయ్‌, అబ్బాయిల మధ్య కూడా ఇలాంటి ఓ కామన్‌ పాయింట్‌ కనిపిస్తోంది. సక్సెస్‌ఫుల్‌ ప్రాజెక్టులను కొనసాగించడంలో అందరూ ఒకే మాట మీదే ఉన్నారు. ఆ డీటైల్స్ మీద ఓ లుక్‌ వేసేద్దాం పదండి...

1 / 5
అఖండ సినిమాను ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. బాలయ్యలోని మాస్‌ యాంగిల్‌ మాత్రమే కాదు, కమర్షియల్‌ యాంగిల్‌ని కూడా సరికొత్తగా డిఫైన్‌ చేసిన సినిమా అఖండ. బోయపాటి - బాలయ్య కాంబో అనగానే అందరికీ గూస్‌బంప్స్ తెప్పించే సినిమాల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది అఖండ. ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందనే మాట ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అయితే ఏప్రిల్‌ నుంచి అఖండ సీక్వెల్‌ స్టార్ట్ అవుతుందనేది సరికొత్త కబురు. ప్రస్తుతం బాబీ సినిమా షూటింగ్‌లో ఉన్న బాలయ్య నెక్స్ట్ నేరుగా బోయపాటి సెట్‌కి వెళ్తారనే మాట వినిపిస్తోంది.

2 / 5
నియర్‌ ఫ్యూచర్‌లో వరుసగా సీక్వెల్స్ లోనే కనిపిస్తారేమో నందమూరి కల్యాణ్‌ రామ్‌. ఆయన నటించిన బింబిసారకు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సీక్వెల్‌ షురూ అవుతుంది. మొన్నీ మధ్య వచ్చి ప్రేక్షకాదరణ పొందిన డెవిల్‌ చిత్రం సీక్వెల్‌ పనులు కూడా ఈ ఏడాదే మొదలుకానున్నాయి.

3 / 5
యువ్‌ నెవర్‌ ప్లే విత్‌ మీ అంటున్నారు యంగ్‌ టైగర్‌. దేవర గ్లింప్స్  చూసిన వారందరూ వారెవా అంటూ పొగుడుతున్నారు తారక్‌ని. భయం అంటూ తెలియనివారికి భయాన్ని పరిచయం చేసే పాత్రలో తారక్‌ చెలరేగిపోయారు. ఈ ఏప్రిల్‌లో ఫస్ట్ పార్టుతో ప్రభంజనం చూపించడానికి రెడీ అంటున్నారు దేవర మేకర్స్.

4 / 5
దేవర సీక్వెల్‌ని కూడా వీలైనంత త్వరగానే మొదలుపెట్టాలన్నది కొరటాల ప్లాన్‌. ఆల్రెడీ సెకండ్‌ పార్టుకు కూడా స్టోరీని లాక్‌ చేసేశారన్నది ఇన్‌సైడ్‌ టాక్‌. దేవర ఫస్ట్ పార్టుకు వచ్చే రెస్పాన్స్ చూసి, సెకండ్‌ పార్టు స్పాన్‌ని ఇంకెంత పెంచాలన్నది డిసైడ్‌ చేస్తారట మేకర్స్. సో నందమూరి హీరోలు ఈ ఏడాది సీక్వెల్స్ షూటింగ్‌లో బిజీ బిజీ అన్నమాట.

5 / 5
Follow us