తెలుగుతో పాటు తమిళం, హిందీలో సినిమాలు నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఈ పని అల్లు అరవింద్, అశ్వినీ దత్ ఎప్పుడో చేసారు. టాలీవుడ్‌లో మోస్ట్ బిజియెస్ట్ ప్రొడక్షన్ హౌజ్ ఇదే. ఈ సంస్థ నుంచి 10 సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. పైగా అన్నీ భారీ ప్రాజెక్ట్సే.. అందులో పుష్ప 2, RC16, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ లాంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పుష్ప 2 బడ్జెట్ 300 కోట్ల వరకు ఉంటే.. బిజినెస్ 500 కోట్ల మేర జరుగుతుంది.