- Telugu News Photo Gallery Cinema photos Megastar chiranjeevi and mohan raja god father combo repeat again with Lucifer sequel Telugu Heroes Photos
God Father Sequel: మరోసారి ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్.. సీక్వెల్ షురూ.
భాషతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకున్న ప్రాజెక్టులు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి లూసిఫర్. మోహన్‌లాల్ పుట్టినరోజున రిలీజ్ అయిన ఎల్2 ఎంపురాన్ ఫొటో చూసినప్పటి నుంచీ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది లూసిఫర్ టాపిక్. ఈ టాపిక్ జస్ట్ మాలీవుడ్ వరకే పరిమితమా అంటే.. బిగ్ నో.. అనే మాట వినిపిస్తోంది. టాలీవుడ్‌లోనూ ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. మోహన్‌లాల్ హీరోగా నటించిన సినిమా లూసిఫర్.
Updated on: May 25, 2024 | 6:25 PM

భాషతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకున్న ప్రాజెక్టులు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి లూసిఫర్. మోహన్‌లాల్ పుట్టినరోజున రిలీజ్ అయిన ఎల్2 ఎంపురాన్ ఫొటో చూసినప్పటి నుంచీ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది లూసిఫర్ టాపిక్.

ఈ టాపిక్ జస్ట్ మాలీవుడ్ వరకే పరిమితమా అంటే... బిగ్ నో... అనే మాట వినిపిస్తోంది. టాలీవుడ్‌లోనూ ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. మోహన్‌లాల్ హీరోగా నటించిన సినిమా లూసిఫర్. పృథ్విరాజ్ సుకుమారన్ డైరక్షన్‌లో ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా మెప్పించింది.

ఫ్యామిలీ వేల్యూస్, ఫ్యామిలీ బాండింగ్, పొలిటికల్ సినారియో అంటూ అన్ని వర్గాల వారినీ మెప్పించిన ఫక్తు కమర్షియల్ సినిమాగా పేరు తెచ్చుకుంది లూసిఫర్. ఇప్పుడు ఎల్2 ఎంపురాన్ పేరుతో లూసిఫర్‌కి సీక్వెల్ సిద్ధం చేస్తున్నారు మేకర్స్.

ఫస్ట్ పార్టులోనే మోహన్‌లాల్‌కి ఏదో స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉందనే హింట్స్ ఇచ్చారు కెప్టెన్ పృథ్విరాజ్. ఇప్పుడు సెకండ్ పార్టులో ఆ సామ్రాజ్యాన్ని చూపిస్తూ, సినిమాను నడిపిస్తారని టాక్.

మలయాళంలో లూసిఫర్‌లో కదలికలు మొదలు కాగానే, తెలుగులో గాడ్‌ఫాదర్‌ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు జనాలు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కింది గాడ్‌ఫాదర్.

లూసిఫర్‌కి తెలుగులో అఫిషియల్ రీమేక్‌గా తెరకెక్కించారు ఈమూవీని. ఇందులో చిరు చెల్లెలి కేరక్టర్ చేశారు నయనతార. మలయాళంలో ఎల్2 ఎంపురాన్ క్లిక్ అయితే.,

తెలుగులోనూ గాడ్‌ఫాదర్‌కి సీక్వెల్ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే, సీక్వెల్‌లో చిరు, సల్మాన్ కలిసి స్క్రీన్ మీద తార్‌మార్ టక్కర్‌మార్ చేసేస్తారన్నమాట.




