- Telugu News Photo Gallery Cinema photos Malla Reddy Entertainments will soon hit the silver screen in Tollywood
Malla Reddy: ఇక సందడే సందడే.. త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పైకి ‘మల్లారెడ్డి ఎంటర్టైన్మెంట్స్’..
Malla Reddy Entertainments: పూలమ్మిన, పాలమ్మిన, కష్టపడ్డ.. ఈ ఒక్క డైలాగ్ చాలు మంత్రి మల్లారెడ్డి క్రేజ్ ఏంటో తెలుసుకోవడానికి. రాజకీయ నాయకుడిగా, మంత్రిగా కంటే ఆయనే ప్రసంగాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారు.
Updated on: Jul 09, 2023 | 10:05 PM

Minister Malla Reddy

ఆయన ఏది మాట్లాడినా యూట్యూబ్లో సంచలనమే.. మిలియన్ల వ్యూస్. అసెంబ్లీలోనూ ఆయన స్పీచ్ అంటే నవ్వుల పంట. కెసిఆర్, కేటీఆర్ కూడా అసెంబ్లీలో పడి పడి నవ్వుతూ ఉంటారు. పొలిటిషినే కాదు మల్లారెడ్డి మంచి ఎంటర్టైనర్ కూడా. యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది ఆయనకు.. ఇదంతా ఒక ఎత్తైతే ఈమధ్య సినిమాలపై దృష్టి పెట్టారట మంత్రి మల్లారెడ్డి.

మల్లారెడ్డి ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించబోతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులతో చర్చలు కూడా అయిపోయాయి. త్వరలో మల్లారెడ్డి సినీ రంగంలో నిర్మాతగా కూడా మారబోతున్నారని సమాచారం.

అంతేకాదు అతి త్వరలో ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానల్ తో పాటు ఒక ఓటీపీ ప్లాట్ఫారం కూడా ప్రారంభించబోతున్నారట. మల్లారెడ్డి కోడలు ఈ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు.

ఇందుకోసమే ఈ మధ్య వరుసగా సినిమా ఫంక్షన్లకి మల్లారెడ్డి గెస్ట్ గా వెళ్తున్నారు. ఆయన వెళ్లడమేమో గాని చిన్న చిన్న సినిమాలకు కూడా పెద్ద ప్రమోషన్ లభిస్తుంది. మల్లారెడ్డి నిర్మాత గానే నా సినిమాల్లో కూడా నటిస్తారా ? సోషల్ మీడియాలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
