- Telugu News Photo Gallery Cinema photos Lai movie actress megha akash latest beautiful photos goes viral
ఆ కళ్ళలోనే ఎదో మాయ ఉంది మావ..! మెంటలెక్కిస్తున్న మేఘా ఆకాష్
మేఘా ఆకాష్ ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె 1995 అక్టోబర్ 26న చెన్నైలో జన్మించింది. తండ్రి తెలుగు, తల్లి మలయాళీ, ఇద్దరూ ప్రకటనల రంగంలో పనిచేస్తారు. మేఘా చెన్నైలోని లేడీ ఆండల్ స్కూల్ మరియు మహిళా క్రిస్టియన్ కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్‌లో బీ.ఎస్సీ పూర్తిచేసింది.
Updated on: Aug 27, 2025 | 1:57 PM

మేఘా ఆకాష్ ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె 1995 అక్టోబర్ 26న చెన్నైలో జన్మించింది. తండ్రి తెలుగు, తల్లి మలయాళీ, ఇద్దరూ ప్రకటనల రంగంలో పనిచేస్తారు. మేఘా చెన్నైలోని లేడీ ఆండల్ స్కూల్ మరియు మహిళా క్రిస్టియన్ కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్‌లో బీ.ఎస్సీ పూర్తిచేసింది.

2017లో నితిన్ సరసన "లై" అనే తెలుగు చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టింది. ఈ చిత్రం విజయం సాధించకపోయినా, ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. SIIMA అవార్డు ఉత్తమ తొలి నటిగా నామినేషన్ అందుకుంది.

ఆ తర్వాత "ఛల్ మోహన్ రంగ" (2018), "రాజ రాజ చోర" (2021), "డియర్ మేఘా" (2021) వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళంలో "పెట్టా" (2019), "ఎనై నోక్కి పాయుమ్ తోట" (2019), హిందీలో "సాటిలైట్ శంకర్" (2019) చిత్రాలలో నటించింది.

2024లో జీవ 5లో విడుదలైన "వికటకవి" వెబ్ సిరీస్‌తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. మేఘా 2024 ఆగస్టులో సాయి విష్ణుతో నిశ్చితార్థం చేసుకుంది, సెప్టెంబర్ 15, 2024న చెన్నైలో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోతుంది.

ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ చిన్నదాని ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.