- Telugu News Photo Gallery Cinema photos Raja Saab Movie Actress Malavika Mohanan Latest Beautiful Saree Looks Goes Viral
Malavika Mohanan: వారెవ్వా వాటే బ్యూటీ.. అదిరిపోయే లుక్‌లో తళుక్కుమన్న ప్రభాస్ హీరోయిన్..
ఇప్పుడిప్పుడే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది మలయాళీ కుట్టి మాళవిక మోహనన్. ఇప్పటివరకు తమిళం, మలయాళం చిత్రాల్లో నటించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో చీరకట్టులో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. చీరకట్టులో అమ్మాడి అందాల ఫోజులకు ఫిదా అవుతున్నారు నెటిజన్స్.
Updated on: Aug 27, 2025 | 7:11 PM

హీరోయిన్ మాళవిక మోహనన్.. తెలుగులో ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో రాజాసాబ్ మూవీలో నటిస్తుంది. ప్రభాస్ , డైరెక్టర్ మారుతీ కాంబోలో వస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

పట్టంపోలే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ సరసన నటించి మెప్పించింది. మొదటి చిత్రంతోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి.

ఆ తర్వాత తమిళం, మలయాళం భాషలలో వరుసగా సినిమాలు చేసి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ డబ్బింగ్ సినిమాలతోనే ఫేమస్ అయ్యింది.

ఇప్పుడు రాజాసాబ్ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇదిలా ఉంటే.. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది మాళవిక. తాజాగా వినాయక చవితి సందర్భంగా చీరకట్టులో ఎంతో అందంగా ముస్తాబైంది.

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ ఆకట్టుకుంటున్నాయి. సింపుల్ చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తుంది ఈ వయ్యారి. ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ మాళవిక అందాల ఫోజులకు ఫిదా అవుతున్నారు.




