- Telugu News Photo Gallery Cinema photos Lady super star Nayanthara movie hits in 2023 Telugu Actress Photos
Nayanthara: 2023ని గుర్తుపెట్టుకుంటామంటున్న లేడీ సూపర్ స్టార్ నయనతార..
గ్లామర్ ఇండస్ట్రీలో అసలు పేర్లకన్నా, ట్యాగులకే కిక్కెక్కువ. అందుకే అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న వారు కూడా తమకు సూట్ అయ్యే ట్యాగ్ సెలక్ట్ చేసుకుని, ఫర్‌దర్‌గా పిలిపించుకోవాలని ఫిక్స్ అయిపోతారు. అలాంటిది అజిత్,సూర్య, నయనతార మాత్రం ఆ విషయంలో ఇంట్రస్టింగ్‌గా లేరు. మమ్మల్ని మా పేర్లతోనే పిలవండి బాబోయ్ అని అంటున్నారు. ఒకప్పుడు మనకు లేడీ సూపర్‌స్టార్ అంటే విజయశాంతి పేరు గుర్తొచ్చేది.
Updated on: Dec 11, 2023 | 2:06 PM

గ్లామర్ ఇండస్ట్రీలో అసలు పేర్లకన్నా, ట్యాగులకే కిక్కెక్కువ. అందుకే అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న వారు కూడా తమకు సూట్ అయ్యే ట్యాగ్ సెలక్ట్ చేసుకుని, ఫర్‌దర్‌గా పిలిపించుకోవాలని ఫిక్స్ అయిపోతారు.

అలాంటిది అజిత్,సూర్య, నయనతార మాత్రం ఆ విషయంలో ఇంట్రస్టింగ్‌గా లేరు. మమ్మల్ని మా పేర్లతోనే పిలవండి బాబోయ్ అని అంటున్నారు. ఒకప్పుడు మనకు లేడీ సూపర్‌స్టార్ అంటే విజయశాంతి పేరు గుర్తొచ్చేది.

కానీ ఇప్పటితరానికి లేడీ సూపర్‌స్టార్ అంటే నయనతారే. జవాన్ రిలీజ్ అయ్యాక అందరూ ఆమెను ఆ పేరుతోనే ఎక్కువగా పిలుస్తున్నారట. అయితే తనను అలా పిలుస్తుంటే తిడుతున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు నయన్.

ఫ్యాన్స్ వల్లే తాను ఈ స్టేజ్‌లో ఉన్నానని, అయినా వాళ్లు లేడీ సూపర్‌స్టార్ అంటే వినడానికి ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు నయన్. ఇటు సూర్య కూడా సేమ్ కంప్లయింట్ చేస్తున్నారు. ఆల్రెడీ స్క్రీన్ కోసం సూర్య అనే పేరు పెట్టుకున్నాను.

ఇప్పుడు నడిప్పిన్ నాయగన్ అంటూ జనాలు పిలవడం నాకు నచ్చడం లేదు. నన్ను సూర్యగా అభిమానిస్తే చాలు అని ఇదివరకే చెప్పారు. ఆ మాటకొస్తే తల అజిత్ కూడా ఇలాంటి స్టేట్‌మెంటే ఇచ్చారు.

అజిత్ అనీ, అజిత్ కుమార్ అనీ, ఏకే అని పిలవండి. అంతేగానీ తల అంటే నాకెందుకో నచ్చట్లేదు. అలా పిలవద్దు అని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు అజిత్. అయినా తమకు నచ్చినట్టు పిలవడాన్ని అభిమానులు మాత్రం మానడం లేదు.




