- Telugu News Photo Gallery Cinema photos Kollywood directors who not only direct but also act as producers
Movie News: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి.. నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న కోలీవుడ్ యంగ్ దర్శకులు..
ప్రజెంట్ కోలీవుడ్ దర్శకుల పేర్లు పాన్ ఇండియా రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవటంలో కూడా ముందే ఉన్నారు ఈ నయా సెన్సేషన్స్. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు, ఫామ్‌లో ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు కష్టపడుతున్నారు. షార్ట్ టైమ్‌లోనే సెన్సేషన్‌గా మారిన కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ నిర్మాతగా మారారు. జవాన్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేసిన అట్లీ, నిర్మాతగానూ బిజీ అవుతున్నారు.
Updated on: Dec 29, 2023 | 4:39 PM

ప్రజెంట్ కోలీవుడ్ దర్శకుల పేర్లు పాన్ ఇండియా రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవటంలో కూడా ముందే ఉన్నారు ఈ నయా సెన్సేషన్స్. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు, ఫామ్‌లో ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు కష్టపడుతున్నారు.

షార్ట్ టైమ్‌లోనే సెన్సేషన్‌గా మారిన కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ నిర్మాతగా మారారు. విక్రమ్, లియో సినిమాల సక్సెస్ తరువాత నేషనల్ లెవల్‌లో వచ్చిన గుర్తింపును క్యాష్ చేసుకుంటూ జీ క్వాడ్ పేరుతో బ్యానర్‌ను లాంచ్ చేశారు. ఈ బ్యానర్‌లో తన అసిస్టెంట్స్‌ను దర్శకులుగా పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారు.


తాజాగా ఈ లిస్ట్‌లోకి ఎంట్రీకి ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు జైలర్ ఫేం నెల్సన్ దిలీప్. రజనీ సినిమాతో నేషనల్ సెన్సేషన్‌గా మారిన నెల్సన్, నిర్మాతగానూ సత్తా చాటే ఆలోచనలో ఉన్నారు.

ఈ యంగ్ జనరేషన్‌కు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు గ్రేట్ డైరెక్టర్ శంకర్. దర్శకుడిగా భారీ చిత్రాలను రూపొందిస్తూనే, నిర్మాతగా యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు శంకర్. ఈ బాటలోనే కొత్త దర్శకులు కూడా తమ స్పాన్‌ను పెంచుకుంటూ పోతున్నారు.




