- Telugu News Photo Gallery Cinema photos Know Mahesh Babu Donates Estimated Crores Each Year and He Saved 4500 Kids Life Throwgh His Foundation
Mahesh Babu: నువ్వు దేవుడివి సామి.. చిట్టి గుండెలకు అండగా మహేష్.. సాయం కోసం ఇలా ధరఖాస్తు చేసుకోండి..
మహేష్ బాబు.. ఈరోజు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్ ఫోటోస్, త్రోబ్యాక్ వీడియోస్ షేర్ చేస్తూ బర్త్ డె చెబుతున్నారు ఫ్యాన్స్. రీల్ హీరోగా కాకుండా రియల్ హీరోగానూ దూసుకుపోతున్నారు. ఐదు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు మహేష్.
Updated on: Aug 09, 2025 | 12:46 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. రాజకుమారుడు, యువరాజు, మురారి చిత్రాలతో అమ్మాయిల హృదయాలు దొచుకున్న మహేష్.. ఆ తర్వాత దూకుడు, పోకిరి, అతడు చిత్రాలతో మాస్ హీరోగానూ అదరగొట్టారు. ఈరోజు (ఆగస్ట్ 9) మహేష్ బాబు 50వ పుట్టినరోజు.

దివంగత హీరో కృష్ణ నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం యావత్ వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే..వెండితెరపైనే కాకుండా నిజజీవితంలోనూ మహేష్ రియల్ హీరో. మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి ఇప్పటివరకు దాదాపు 4500 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్డ్ ఆపరేషన్స్ చేయించారు. తన కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు గుండె సంబంధిత సమస్య ఎదుర్కొన్నాడు.

అయితే తనకు ఆర్థికంగా సౌలభ్యం ఉండడంతో సర్జరీ చేయించగలిగాడు. కానీ డబ్బులేక చిన్నారులు చికిత్స అందుకోలేకపోతున్నారని ఆలోచించి ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ పేరుతో ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించాడు. చిన్నారుల ప్రాణాల కోసమే ఏడాదికి దాదాపు 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. పేద పిల్లల హార్ట్ సర్జరీ కోసం డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోనే https://www.maheshbabufoundation.org/request/ రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఇందులో పూర్తి వివరాలతో నమోదు చేసుకుంటే మహేశ్ టీమ్ మిమ్మల్నే సంప్రదిస్తుంది.

అంతేకాకుండా గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు, బాలికలకు గర్భకోశ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్లు, పాఠశాలకు కంప్యూటర్లతోపాటు మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలకు ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎంతో ప్రశంసనీయం. 2016లో ఏపీలోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు.




