సినిమా సెట్స్‌లో క్లీంకారా..డాడితో ఉన్న క్యూట్ ఫొటో వైరల్
చిరంజీవి ముద్దుల మనవరాలు, రామ్ చరణ్ గారాల పట్టీ క్లీంకార. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్లైన 10 సంవత్సరాల త్వాత ఈ పాప జన్మించింది. ఇక క్లీంకార విషయంలో రామ్ చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక చెర్రీ ఇప్పటి వరకు తన కూతురు ఫేస్ రివీల్ చేయలేదు. అప్పుడప్పుడు తన ఫేస్ కనిపించకుండా ఉన్న ఫొటోస్‌ను షేర్ చేస్తూ..అభిమానులను సర్ప్రైజ్ చేస్తుంటారు. దీంతో తమ అభిమాన హీరో కూతురు ఎలా ఉందో చూడాలని తన ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ చరణ్ మాత్రం తన కూతురును చూపించడం లేదు. అయితే తాజాగా క్లీంకార షూటింగ్ సెట్‌లో దర్శనం ఇచ్చింది.
Updated on: Feb 06, 2025 | 7:38 AM

రామ్ చరణ్ తన ముద్దుల కూతురికి షూటింగ్ ఎలా జరుగుతుందో చూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

సానా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ క్రమంలో చెర్రీ తన కూతురును షూటింగ్ సెట్‌కు తీసుకెళ్లారు.

దీనికి సంబంధించిన ఫొటోను చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ''సెట్‌లో నా చిన్నారి అతిథి. #RC16'' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ ఫొటోలో క్లీంకారా ఏదో చూపిస్తూ.. తన డాడీ (చరణ్)ను ఏదో అడిగినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ ఫొటోలో కూడా రామ్ చరణ్ తన కూతురి ఫేస్ కనిపించకుండా కవర్ చేశారు. ఇందులో చెర్రీ నవ్వుతూ.. చాలా సంతోషంగా కనిపించారు.

ఇక రామ్ చరణ్ RC16 మూవీ షూటింగ్ ప్రస్తుతం చిత్రీకరణ జూబ్లీహిల్స్ బూత్ బంగ్లాలో జరుగుతోంది. ఈ లొకేషన్ మెగా ఫ్యామిలీ ఇంటికి చాలా దగ్గరగా ఉండటంతో, చెర్రీ క్లీంకారాను సెట్స్ వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.





























