- Telugu News Photo Gallery Cinema photos Sankranti ki vasthunnam Movie Actress Aishwarya Rajesh Latest Photos
చీరలో మెరిసిపోతున్న సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ..భాగ్యం ఎంత బాగుందో!
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బ్యూటీ ఐశ్వర్యరాజేష్. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాగ్యం పాత్రలో తెలుగు ఆడియన్స్‌కు చాలా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది.
Updated on: Feb 06, 2025 | 8:21 AM

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన భాగ్యంపాత్రలో నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరినోట విన్నా ఈ నటి పేరే వినిపిస్తుంది.

ఇక కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఐశ్వర్యా రాజేష్ తెలుగులో చాలా సినిమాల్లోనే నటించింది. చూడటానికి మాములు గృహిణిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ, తన నేచురల్ నటనతో అభిమానులను కట్టిపడేస్తుంది.

ఇక మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్న ఈ అమ్మడు తాజాగా తన అందాలతో కుర్రకారుకు బాణాలు విసిరింది. పసుపు రంగు చీర ధరించి ఎంతో అందంగా కనిపించింది.

ట్రెడిషనల్ లుక్‌లో, చూడటానికి చాలా పద్ధతిగా ఉంది ఐశ్వర్యా రాజేష్. శారీలో తన వయ్యారాలను ఒలుకబోస్తూ.. అందరినీ మరోసారి తనవైపుకు తింపుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. దీంతో భాగ్యం చీరలో చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్