- Telugu News Photo Gallery Cinema photos Keerthy Suresh New Looks In AKKA Teaser goes viral in social media
Keerthy suresh: అన్ని క్యారెక్టర్లకు న్యాయం చేస్తానంటున్న నాయిక
తగ్గడాలు, పెరగడాల గురించి ఆలోచనలూ, మాటలూ వేస్ట్ అబ్బా.. దున్నేశామా? దూసుకుపోయామా? అన్నట్టుండాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉంటాం అలా? అని అంటున్నారు కీర్తీ సురేష్. ఈ మాటలు ఎప్పుడన్నారు? ఎక్కడన్నారు? అని అడుగుతున్నారా? ఆమె చర్యలు ఊహాతీతం అంటున్నారు అబ్జర్వర్స్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Feb 07, 2025 | 2:30 PM

అక్కా ఫస్ట్ లుక్ చూశారా? దిస్ ఇయర్ పవర్ హ్యాజ్ న్యూ నేమ్ అక్కా అంటూ పవర్‌ఫుల్‌గా కీర్తీ సురేష్ కేరక్టర్‌ని రివీల్ చేశారు మేకర్స్. సౌత్ ఇండియాలో ఓ చోట జరిగే ఘటనల సమాహారంగా అక్కా సీరీస్ ని రూపొందిస్తోంది యష్ రాజ్ ఫిల్మ్స్.

అక్కా కంటెంట్ గురించి హాట్ డిస్కషన్ జరిగినా, జరగకపోయినా కీర్తీ సురేష్ లుక్స్ గురించి మాత్రం అందరూ కాస్త గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికక్కడా ఏ మాత్రం పొంతన లేకుండా రోల్స్ సెలక్ట్ చేసుకుంటూ చెలరేగిపోతున్నారన్నది కొందరి నుంచి వినిపిస్తున్న కామెంట్.

మరికొందరు మాత్రం హాట్‌నెస్ ఓవర్‌లోడెడ్ అని అంటున్నారు. ఆ మాటకొస్తే మహేష్తో మ మ మహేశా సాంగ్ నుంచే హద్దులు దాటేశారన్నది మరికొందరు చెబుతున్న మాట. సర్కారు వారి పాటలో నటించడానికి ముందు కీర్తీ సురేష్ అంటే పక్కింటమ్మాయి ఇమేజ్ మాత్రమే ఉండేది.

కానీ మహేష్ తో సాంగులో స్టెప్పులేసినప్పుడు మాత్రం కీర్తీలోనూ పక్కా కమర్షియల్ హీరోయిన్ లక్షణాలున్నాయని అందరూ అనుకున్నారు. రీసెంట్‌గా బేబీ జాన్ చేసినప్పుడు కీర్తీ ఈజ్ ద బెస్ట్ అని ఫిక్సయ్యారు.

ఇప్పుడు అక్కా సీరీస్ ఫస్ట్ లుక్ చూసిన వారైతే ఫ్యూచర్‌లో కీర్తీ సురేష్ ఇంకెంత గ్లామరస్‌గా కనిపిస్తారోనని మాట్లాడుకుంటున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో నిండైన వస్త్రధారణతో కనిపించిన కీర్తీ, ఆఫ్టర్ మేరేజ్ మాత్రం పక్కా వెస్టర్న్ గర్ల్ గా మెప్పించడానికి ట్రై చేస్తున్నారు. అలాగని నటనకు స్కోప్ ఉన్న కేరక్టర్లకూ దూరం కావడం లేదు ఈ బ్యూటీ. ఇప్పటికైతే అన్నిటినీ బ్యాలన్స్ చేయడానికే ట్రై చేస్తున్నారు.





























