సమ్మర్ 2024కి కాంతార ఏ లెజెండ్ రిలీజ్ ప్లాన్ చేసినా.. పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా 2024 దసరాకు లేదంటే 2025 సంక్రాంతి సీజన్‌లో రావొచ్చని అంచనా. బడ్జెట్ లిమిట్స్ లేకుండా హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని 150 కోట్లతో నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, బెంగాళీ, ఇంగ్లీష్‌లోనూ కాంతారా 2 విడుదల కానుంది. వచ్చే ఏడాది ఆస్కార్‌కు తమ సినిమాను పంపించాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.