Preity Mukhundhan: కన్నప్ప క్యూటీ లేటెస్ట్ ఫొటోస్.. కుర్రాళ్లను ఫిదా చేస్తుందిగా..
ప్రీతి ముకుందన్ .. మోడలింగ్ నుంచి కెరీర్ మొదలు పెట్టింది. ఈ అమ్మడు భరతనాట్య నృత్యకారిణి కూడా. ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాల్లో పనిచేస్తుంది. ఆమె 2000 జూలై 30న తమిళనాడులోని తిరుచ్చిలో జన్మించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచ్చి నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తిచేసింది.
Updated on: Apr 12, 2025 | 8:53 PM

ప్రీతి ముకుందన్ .. మోడలింగ్ నుంచి కెరీర్ మొదలు పెట్టింది. ఈ అమ్మడు భరతనాట్య నృత్యకారిణి కూడా. ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాల్లో పనిచేస్తుంది. ఆమె 2000 జూలై 30న తమిళనాడులోని తిరుచ్చిలో జన్మించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచ్చి నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తిచేసింది.

ప్రీతి తన నటనా జీవితాన్ని టీవీ షోలలో నృత్య ప్రదర్శనలతో ప్రారంభించింది. 2022లో "ముత్తు ము2" అనే మ్యూజిక్ వీడియోతో యూట్యూబ్‌లో 4.2 మిలియన్లకు పైగా వీక్షణలతో పాపులర్ అయింది. 2024లో ఓం భీమ్ బుష్ తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో శ్రీ విష్ణు సరసన నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అదే సంవత్సరం తమిళ చిత్రం స్టార్ అనే సినిమాలో కవిన్ సరసన ప్రధాన పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో నటిస్తుంది. శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ఇది. ఈ సినిమాలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.

భరతనాట్యంలో చిన్న వయస్సు నుండి శిక్షణ పొందిన ప్రీతి, హిప్-హాప్, సినీ జానపదం, పాశ్చాత్య నృత్యాల్లోనూ నైపుణ్యం సాధించింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో తన నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకుంది. కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేసిన ఆమె, దక్షిణ భారత యాడ్-ఫిల్మ్ పరిశ్రమలో టీవీ వాణిజ్య ప్రకటనల ద్వారా గుర్తింపు పొందింది.

ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.