Janhvi Kapoor: ఆ చిరునవ్వుకే దాసోహమవదా ఈ ప్రపంచం.. పట్టుచీరలో పుత్తడిబొమ్మలా జాన్వీ..
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది జాన్వీ. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తుంది. కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగులో జాన్వీ చేస్తోన్న ఫస్ట్ మూవీ ఇదే. ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది జాన్వీ. సీనియర్ హీరోయిన్ మహేశ్వరితో కలిసి శ్రీవారి బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుంది.