Eagle: సంక్రాంతి సినిమాల్లో ఫస్ట్ వికెట్ డౌన్.. ఈగల్ పోస్ట్ పోన్ ??
సంక్రాంతికి ఐదు సినిమాలు చెప్పినవి చెప్పినట్లు వచ్చేస్తున్నాయంటూ నిన్నటి వరకు కూడా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆడియన్స్ కూడా దీనికే ఫిక్సైపోయారు. పైగా దర్శక నిర్మాతలు మాటలు చూస్తుంటే ఎవరూ వెనక్కి తగ్గేలా కూడా కనిపించడం లేదని అర్థమైంది. దిల్ రాజు లాంటి వాళ్లు వచ్చి వాయిదా వేసుకున్న వాళ్లకు సోలో డేట్ ఇప్పిస్తామని చెప్పినా కూడా నిర్మాతలు నో కాంప్రమైజ్ అంటున్నారు. దాన్నిబట్టి పండగను వాళ్లెంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థమవుతుంది. ఇదిలా ఉంటే చివరి నిమిషంలో రవితేజ వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతుంది. ఈగల్ సినిమాను జనవరి 13న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
