- Telugu News Photo Gallery Cinema photos Is Ustaad Bhagat Singh latest movie to the pawan kalyan know the details
Ustaad Bhagat Singh: ఉస్తాద్ షురూ.. పవన్ కళ్యాణ్‌కు చివరి సినిమా ఇదేనా ??
ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్‌కు చివరి సినిమా కాబోతుందా..? అందుకే ఒప్పుకున్న సినిమాలన్నింటినీ అంత వేగంగా పూర్తి చేస్తున్నారా..? ఉస్తాద్ షూట్ అయిపోతే.. పవన్‌ను ఇక పవర్ స్టార్‌గా కంటే జనసేనానిగానే ఫ్యాన్స్ చూడబోతున్నారా..? సీరియస్ పొలిటీషియన్‌గా ఉండాలనే.. సినిమాలకు అన్ అఫీషియల్ రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారా..?
Updated on: Jun 11, 2025 | 6:15 PM

ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేయాలని గట్టిగా ఫిక్సయ్యారు పవన్ కళ్యాణ్. అందుకే నెల రోజుల గ్యాప్‌లోనే మూడో సినిమా సెట్‌లో జాయిన్ అయిపోయారీయన. ఆ మధ్య హరిహర వీరమల్లు.. ఈ మధ్యే ఓజి.

తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్.. ఇలా రెండేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ ఒకేసారి పూర్తి చేస్తున్నారు పవర్ స్టార్. హైదరాబాద్‌లో ఉస్తాద్ షూటింగ్ మొదలైంది. పవన్ కూడా సెట్‌లో అడుగు పెట్టారు.

కోటి ఉమెన్స్ కాలేజ్‌తో పాటు, అల్యూమీనియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమాకు పవన్ 45 రోజుల డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆగస్ట్‌లోపే టాకీ పార్ట్ పూర్తి కానుంది.

ఉస్తాద్ తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితమవ్వాలని చూస్తున్నారు జనసేనాని.గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో ఉస్తాద్‌పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. పైగా గతంలో వచ్చిన టీజర్స్‌కు రెస్పాన్స్ అదిరింది.

పవన్ పొలిటికల్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేసారు హరీష్ శంకర్. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తైతే.. అధికారికంగా పవన్ ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తైనట్లే. వీటి తర్వాత కొత్త అడ్వాన్సులు అయితే పవన్ తీసుకోలేదు.




