- Telugu News Photo Gallery Cinema photos Is Pawan Kalyans next films are ready to release in the summer
Pawan Kalyan: ఎన్నికల ముందే ఫ్యాన్స్ కు ఫీస్ట్.. వరసగా పవన్ సినిమాలు రిలీజ్ కు సిద్ధం ??
బ్రో పవన్ కళ్యాణ్‌లో గట్టి మార్పులే తీసుకొచ్చింది. ఎలక్షన్స్ వరకు సినిమాలే వద్దనుకున్న వాడు కాస్తా పూర్తిగా మారిపోయారిప్పుడు. ఆగినవి, అటకెక్కినవి అనుకున్నవి అన్నింటికీ దుమ్ము దులిపేసి.. ఎన్నికల ముందే ఆడియన్స్ ముందుకు తెచ్చేయాలని ప్లాన్ చేస్తున్నారు పవర్ స్టార్. అసలు ఈ రేంజ్ మార్పు పవన్‌లో రావడానికి కారణమేంటి..? రాబోయే సినిమాల్లో మరింత పొలిటికల్ వేడి చూడబోతున్నామా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
Updated on: Aug 03, 2023 | 7:14 PM

నిజమే.. పవన్ కళ్యాణ్ నిజంగానే ఆకాశం లాంటివాడేనేమో..? ఎప్పుడు ఉరుముతాడో.. ఎప్పుడు శాంతంగా ఉంటాడో.. ఎప్పుడు మండుతాడో అంచనా వేయడం కష్టమే. సినిమాల విషయంలోనూ అంతే. ఓసారి చేస్తానంటారు.. మరోసారి ఇప్పుడు కుదిరేలా లేదంటారు. ఎలక్షన్స్‌కి ముందు బ్రో సినిమానే చివరిది.. ఉస్తాద్, వీరమల్లు, ఓజి అన్నీ ఆఫ్టర్ ఎలక్షన్స్ అని ఫిక్సైపోయారు ఫ్యాన్స్. కానీ అంతలోనే ఓ ట్విస్ట్ వచ్చింది.

బ్రో తర్వాత పవన్ లెక్కలు మారిపోయినట్లు అనిపిస్తుంది. ఎలక్షన్స్ వరకు సినిమాలే వద్దనుకున్న పవర్ స్టార్.. ఉన్నట్లుండి ఉస్తాద్‌ను మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే గతవారం హరీష్ శంకర్ మంగళగిరి వెళ్లి పార్టీ ఆఫీస్‌లోనే పవన్‌ను కలిసి వచ్చారు కూడా. అన్నీ కుదిర్తే ఆగస్ట్ 15 నుంచి ఉస్తాద్ నాన్ స్టాప్ షెడ్యూల్ మొదలు కానుంది. రికార్డ్ టైమ్‌లో ఉస్తాద్ పూర్తి చేయాలని చూస్తున్నారు హరీష్.

పవన్ కళ్యాణ్‌కు ఉస్తాద్ కీలకమైన సినిమా. దీన్ని తన పొలిటికల్ వెపన్‌గా వాడుకోవాలని చూస్తున్నారు జనసేనాని. ఇందులో కావాల్సినంత వినోదంతో పాటు.. పొలిటికల్ సెటైర్లు కూడా ఉండబోతున్నాయి. పేరుకు తెరీ రీమేక్ అయినా.. పూర్తిగా కొత్త స్క్రిప్ట్‌తోనే వస్తున్నారు హరీష్. ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసి.. డిసెంబర్‌లోపు షూట్ పూర్తి చేసి.. సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్‌తో ఉన్నారు మేకర్స్.

ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే కాదు.. ఓజికి కూడా మోక్షం వచ్చేలా కనిపిస్తుంది. మరో 40 రోజులు షూట్ చేస్తే ఓజి పూర్తి కానుంది. సెప్టెంబర్‌లో దీనికి కూడా డేట్స్ ఇవ్వనున్నారు పవన్. ఎన్నికలు ఎప్రిల్‌లో వస్తే.. ఓజి, ఉస్తాద్ ఆలోపే విడుదల కానున్నాయి. ఒకవేళ ముందస్తు ఎలక్షన్స్ వస్తే మాత్రం ప్లానింగ్ డిస్టర్బ్ అవుతుంది. మొత్తానికి బ్రో తర్వాత పవన్ మరోసారి సినిమాలపై ఫోకస్ చేసారన్నమాట.

Bro Thumb