- Telugu News Photo Gallery Cinema photos In an interview with Rajamouli, Prashanth Neel revealed sensational things about Salaar
Salaar Interview: జక్కన్నతో ఇంటర్వ్యూలో సలార్ విషయంలో సంచలనా వెల్లడి.. అంతా కేపబిలిటీ నాకు లేదన్న ప్రశాంత్..
సలార్ సినిమా విషయంలో వింత సమస్యను ఎదుర్కొంటోంది చిత్రయూనిట్. మామూలుగా ఏ సినిమా మీదైన హైప్ తీసుకురావటం కోసం మేకర్స్ నానా తంటాలు పడతారు. కానీ సలార్ విషయంలో హద్దులు దాటుతున్న అంచనాలను కంట్రోల్ చేసేందుకు మేకర్స్ కష్టపడాల్సి వస్తోంది. ఇప్పటికే ప్రమోషన్ తగ్గించిన టీమ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో కంటెంట్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Dec 21, 2023 | 4:30 PM

సలార్ మేనియా ఏ రేంజ్‌లో ఉందంటే అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్ చూసి మేకర్సే భయపడుతున్నారు. ఈ స్థాయిలో అంచనాలు ఉంటే కంటెంట్ అంతకుమించి ఉంటేగానీ ఆడియన్స్ సాటిస్‌ఫై అవ్వరు. అందుకే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కాస్త కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది యూనిట్. రీసెంట్ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ పాయింట్స్ రివీల్ చేశారు మేకర్స్.

ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్‌తో సలార్ పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ అన్న ఒపీనియన్ క్రియేట్ అయ్యింది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

సలార్ పార్ట్ 1లో యాక్షన్ కన్నా డ్రామానే ఎక్కువగా ఉండబోతోందట. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథను మోర్ డ్రామాతో రూపొందించానని క్లారిటీ ఇచ్చారు. అయితే ట్రైలర్‌లో ఆ యాంగిల్ ప్రెజెంట్ చేయటం తనకు రాలేదని ఒప్పేసుకున్నారు.

సలార్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసిన మరో అంశం కేజీఎఫ్‌తో లింక్. సలార్ ఎనౌన్స్‌మెంట్ దగ్గరనుంచి వైరల్ అవుతున్న ఈ వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చేశారు ప్రశాంత్ నీల్.

సలార్, కేజీఎఫ్ సినిమాల మధ్య సంబంధం ఉండదన్న నీల్, అసలు యూనివర్స్‌లు బిల్డ్ చేయటం తనకు చేతకాదని సలార్ కంప్లీట్‌గా డిఫరెంట్ స్టోరి అని క్లారిటీ ఇచ్చారు. ఇంతగా సినిమా మీద అంచనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నా.. అభిమానులు మాత్రం అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి.





























