- Telugu News Photo Gallery Cinema photos Heroine Janhvi Kapoor Clarity On She Paying Money For Praising Her comments Telugu Actress Photos
Janhvi Kapoor: డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్.! జాన్వీ కపూర్ క్రేజీ ఆన్సర్.!
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. హిందీ, తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగులో ఆర్సీ 16, నాని కొత్త సినిమాల్లోనూ నటించనుంది. ఇటు తెలుగులో సినిమాలను ఓకే చేస్తూనే మరోవైపు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది జాన్వీ కపూర్.
Updated on: Jul 28, 2024 | 5:34 PM

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. హిందీ, తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది.

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగులో ఆర్సీ 16, నాని కొత్త సినిమాల్లోనూ నటించనుంది.

ఇటు తెలుగులో సినిమాలను ఓకే చేస్తూనే మరోవైపు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది జాన్వీ కపూర్.

ఈ అమ్మడి హాట్ ఫొటోస్ నెట్టింట ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా జాన్వీ కపూర్ కు సంబంధించి ఏదోక న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఆమెను కొందరు సెలబ్రిటీలు పొగడడం కామన్ అయిపోయింది. దీంతో ఇదంతా సెల్ఫ్ డబ్బా.. పెయిడ్ ప్రమోషన్ అనే కామెంట్ కొంత మంది నెటిజెన్స్ నుంచి గట్టిగా వస్తోంది.

అది కాస్తా ఎక్కువగా వినిపించే సరికి.. ఈ కామెంట్ పై తాజాగా రియాక్టైంది ఈ బ్యూటీ. ఎవరైనా సోషల్ మీడియాలో తనను పొరపాటున పొగిడితే వాళ్లకు తాను డబ్బులిస్తున్నానని అంటున్నారు.

వాళ్లు నా పీఆర్ టీమ్ కాదు.. డబ్బు ఇచ్చి మరీ పొగిడించుకునేంత బడ్జెట్ నా దగ్గర లేదంటూ చెప్పుకొచ్చింది జాన్వీ.




