- Telugu News Photo Gallery Cinema photos Hero ajith next movie vidaamuyarchi and good bad ugly release date update here Telugu Heroes Photos
Ajith: పెద్ద సినిమాల కారణంగా వెనకబడుతున్న అజిత్.! రెండు సినిమాలు పెండింగ్.
ఈ రోజుల్లో స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే కష్టమనుకుంటే.. ఇప్పుడో స్టార్ హీరో నటించిన రెండు సినిమాలు ఒకేసారి వచ్చేలా కనిపిస్తున్నాయి. వాటి బిజినెస్ రేంజ్ దాదాపు 500 కోట్లకు పైగానే ఉంటుంది. ఆ సినిమాలకు రిలీజ్ డేట్ కావాలిప్పుడు. మరి ఒకేసారి రెండు సినిమాలను రెడీ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.? ఒకేసారి రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నపుడు హీరోలు పడే టెన్షన్ మామూలుగా ఉండదు.
Updated on: Oct 04, 2024 | 10:40 AM

ఈ రోజుల్లో స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే కష్టమనుకుంటే.. ఇప్పుడో స్టార్ హీరో నటించిన రెండు సినిమాలు ఒకేసారి వచ్చేలా కనిపిస్తున్నాయి.

వాటి బిజినెస్ రేంజ్ దాదాపు 500 కోట్లకు పైగానే ఉంటుంది. ఆ సినిమాలకు రిలీజ్ డేట్ కావాలిప్పుడు. మరి ఒకేసారి రెండు సినిమాలను రెడీ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.?

ఒకేసారి రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నపుడు హీరోలు పడే టెన్షన్ మామూలుగా ఉండదు. డేట్స్ అడ్జస్ట్ చేయడానికి తంటాలు పడుతుంటారు. పగలిక్కడ.. రాత్రక్కడ అంటూ షిఫ్ట్‌లు చేస్తుంటారు.

అజిత్ ఇదే చేస్తున్నారు. ఇటు విడాముయార్చి.. అటు గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్స్ చివరిదశకు వచ్చేసాయి. ఈ రెండింటి రిలీజ్ డేట్స్ క్లాష్ అయ్యేలా ఉన్నాయిప్పుడు.

మగిళ తిరుమెని తెరకెక్కిస్తున్న విడాముయార్చిని ముందుగా అక్టోబర్ రిలీజ్‌కు ప్లాన్ చేసారు. కానీ అనుకోని కారణాలతో రిలీజ్ డేట్ వాయిదా పడేలా కనిపిస్తుందిప్పుడు.

కానీ అదే పండక్కి అజిత్ నటిస్తున్న మరో సినిమా గుడ్ బ్యాక్ అగ్లీ రేసులో ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీతో కోలీవుడ్‌కు పరిచయమవుతున్నారు మైత్రి మూవీ మేకర్స్.

ఈ సినిమా పొంగల్‌కు వస్తే.. విడాముయార్చిని డిసెంబర్‌లో విడుదల చేసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు. ఇదే జరిగితే అజిత్ ఫ్యాన్స్‌కు అంతకు మించిన పండగ మరోటి ఉండదు. మరి చూడాలిక.. ఈ రిలీజ్ డేట్స్ కన్ఫ్యూజన్ నుంచి అజిత్ ఎలా బయటపడతారో..?




