- Telugu News Photo Gallery Cinema photos Have you ever seen Bollywood Actress Raveena Tandon daughter Rasha Thadani she is look like her mother
Raveena Tandon: కేజీఎఫ్ 2 ఫేమ్ రవీనా టాండన్ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా ? అందంలో అమ్మను మించిపోయిందిగా..
తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ పరిచయమే. బాలకృష్ణ బంగారు బుల్లోడు, నాగార్జున ఆకాశవీధిలో తదితర సినిమాల్లో నటించింది. ఇక గతేడాది విడుదలైన కేజీఎఫ్ 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది.
Updated on: Aug 10, 2023 | 7:40 AM

90వ దశకంలో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగొందింది రవీనా టాండన్. స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. తనదైన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ పరిచయమే. బాలకృష్ణ బంగారు బుల్లోడు, నాగార్జున ఆకాశవీధిలో తదితర సినిమాల్లో నటించింది. ఇక గతేడాది విడుదలైన కేజీఎఫ్ 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది.

ఇందులో రవీనా పోషించిన రమీకా సేన్ పాత్రకు పలువురి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం పలు హిందీ, సౌత్ సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటోందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందీ అందాల తార.

తాజాగా తన కూతురు రాషా టాండన్‌తో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రవీనా. వీటిని చూసిన నెటిజన్లు రషా అచ్చం అమ్మలాగే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా బాలీవుడ్ పరిశ్రమకు చెందిన అనిల్ తడానీని ప్రేమించి వివాహం చేసుకుంది రవీనా. 2004 ఫిబ్రవరి 22న వీరిద్దరి వివాహం జరిగింది వీరి ప్రేమ బంధానికి గుర్తుగా కూతురు రాషా.. కుమారుడు రణబీర్వర్దన్ ఉన్నారు.




