- Telugu News Photo Gallery Cinema photos Has the public lost faith in YRF Spy Universe? The makers have their hopes on those two films
YRF Spy Universe: స్పై యూనివర్స్‌పై నమ్మకం పోయిందా..? ఆ రెండు సినిమాలపైనే ఆశలు..
రీసెంట్ టైమ్స్‌లో అన్ని ఇండస్ట్రీల్లో యూనివర్స్‌ల ట్రెండ్ కనిపిస్తోంది. బాలీవుడ్‌లో కామెడీ యూనియర్స్‌లు ఎప్పటి నుంచో ఉన్నా... సీరియస్, యాక్షన్ బేస్డ్ సినిమా యూనివర్స్‌లు మాత్రం ఈ మధ్యే మొదలయ్యాయి. అది కూడా సౌత్‌లో ఈ ట్రెండ్ మొదలయ్యాకే నార్త్ మేకర్స్ కూడా యాక్షన్ జానర్‌లో యూనివర్స్‌లు స్టార్ట్ చేశారు.
Updated on: Jun 15, 2025 | 4:15 PM

ఎక్తా టైగర్, టైగర్ జిందాహై, వార్ సినిమాలు రిలీజ్ అయిన సమయంలో కొన్ని క్రాసోవర్ క్యారెక్టర్స్ కనిపించినా.. యూనివర్స్ అన్న మాట తెర మీదకు రాలేదు. కానీ పఠాన్ సినిమా రిలీజ్ టైమ్‌కు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌ను ఎనౌన్స్ చేశారు.

అప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలతో పాటు ఆ తరువాత చేయబోయే స్పై మూవీస్‌ను కూడా ఈ యూనివర్స్‌లో భాగంగానే రిలీజ్ చేస్తామని చెప్పారు. టైగర్ 3 రిలీజ్ టైమ్‌లో యూనివర్స్ మీద అంచనాలు పెంచే హింట్ ఇచ్చింది యష్ రాజ్ ఫిలింస్.

పఠాన్, టైగర్ క్యారెక్టర్ల మధ్య క్లాష్ నేపథ్యంలో పఠాన్ వర్సస్ టైగర్ అనే భారీ మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా హింట్ ఇచ్చింది. త్వరలోనే ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళుతుందనుకుంటున్న టైమ్‌లో సడన్‌గా స్పై యూనివర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ఆలోచన చేస్తోంది.

ప్రజెంట్ బాలీవుడ్ స్టార్స్ మార్కెట్, స్పై యూనివర్స్ మీద ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని పఠాన్ వర్సెస్ టైగర్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసింది. అంతేకాదు ఇక మీదట ఈ యూనివర్స్‌ను కొనసాగించాలా వద్దా అన్న విషయంలోనూ డైలమాలో పడింది వైఆర్ఎఫ్.

ప్రజెంట్ ఈ యూనివర్స్‌లో వార్ 2, ఆల్ఫా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ రెండు సినిమాల రిజల్టే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ భవితవ్యాన్ని తేల్చనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలు అంతకు మించి వసూళ్లు సాధిస్తేనే ఈ లిస్ట్‌లో మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. లేదంటే ఇక స్పై యూనివర్స్ ముగిసిపోయినట్టే.



















