Salaar vs Dunki: సలార్ vs డంకీ.! ఆ విషయంలో ప్రభాస్ ను ఫాలో అయిన షారుఖ్.
డిసెంబర్ థర్డ్ వీక్‌లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ బిగ్ ఫైట్ జరగనుంది. సౌత్ నుంచి సలార్, నార్త్ నుంచి డంకీ సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో పోటీ పడుతున్నాయి. తెర మీద ఢీ అంటే ఢీ అంటున్న ఈ రెండు సినిమాలు ప్రమోషన్ విషయంలో మాత్రం సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాయి. సెకండ్ ట్రైలర్‌తో సలార్ మీద ఉన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసేసింది చిత్రయూనిట్. ప్రభాస్ మాస్ రాంపేజ్ మరో లెవల్‌లో ఉంటుందన్న క్లారిటీ వచ్చేయటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.