2023 సమ్మర్లో పెద్ద సినిమాలు ఏవి రాలేదు. కేవలం విరూపాక్ష, దసరా సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన శాకుంతలం, ఏజెంట్, రావణాసుర లాంటి సినిమాలు నిరాశ పరిచాయి. ఇక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలెవరు సమ్మర్ వైపు కనీసం చూడలేదు. ఈసారి కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది.