- Telugu News Photo Gallery Cinema photos Actress Anupama Parameswaran Glamour show in siddu jonnalagadda Tillu Square Movie Telugu Heroines Photos
Anupama Parameswaran: అనుపమ అందాలతో వేడెక్కుతున్న టిల్లు స్క్వేర్.. నెక్స్ట్ లెవల్ గ్లామర్.
టిల్లు గాడి కోసం అనుపమ పరమేశ్వరన్ అందాలన్నీ ఆరబోసిందా..? చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఒక్కో పోస్టర్ విడుదలయ్యే కొద్దీ టిల్లు కంటే కాన్సట్రేషన్ అంతా ఇప్పుడు అనుపమ వైపే వెళ్తుంది. కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా టిల్లు స్క్వేర్‌లో రెచ్చిపోయారు ఈ బ్యూటీ. మరి అనుపమ అందాలు డిజే టిల్లు సీక్వెల్‌కు ఎంతవరకు హెల్ప్ కానున్నాయి..? ఇంకా చాలా ఉన్నాయ్.. దాచాం లోపల.. అదేదో సినిమా ఫంక్షన్‌లో బాలయ్య చెప్పిన ఈ డైలాగ్ సినిమాలో బాగా ఫేమస్ అయింది.
Updated on: Jan 27, 2024 | 5:13 PM

టిల్లు గాడి కోసం అనుపమ పరమేశ్వరన్ అందాలన్నీ ఆరబోసిందా..? చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఒక్కో పోస్టర్ విడుదలయ్యే కొద్దీ టిల్లు కంటే కాన్సట్రేషన్ అంతా ఇప్పుడు అనుపమ వైపే వెళ్తుంది.

కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా టిల్లు స్క్వేర్‌లో రెచ్చిపోయారు ఈ బ్యూటీ. మరి అనుపమ అందాలు డిజే టిల్లు సీక్వెల్‌కు ఎంతవరకు హెల్ప్ కానున్నాయి..? ఇంకా చాలా ఉన్నాయ్.. దాచాం లోపల.. అదేదో సినిమా ఫంక్షన్‌లో బాలయ్య చెప్పిన ఈ డైలాగ్ సినిమాలో బాగా ఫేమస్ అయింది.

టిల్లు స్క్వేర్ ప్రమోషన్ చూస్తుంటే ఇదే అనిపిస్తుందిప్పుడు. మరీ ముఖ్యంగా ఒక్కో పోస్టర్లో అనుపమలోని ఒక్కో గ్లామర్ యాంగిల్ చూపిస్తున్నారు. మెల్లగా ఇండస్ట్రీ పద్దతులను అనుపమ బానే అర్థం చేసుకున్నారు.

అందుకే ఈ మధ్య కాస్త అందాల ఆరబోతలో హద్దులు మీరుతున్నారు. రౌడీ బాయ్స్ నుంచి అనుపమ 2.0 కనిపిస్తున్నారు. అందులో ఆశిష్ రెడ్డితో లిప్ లాక్స్‌తో పాటు ఇంటిమేట్ సీన్స్ కూడా ఇంటెన్స్‌తో చేసారు అనుపమ.

ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతూ ఉన్నారు. తాజాగా టిల్లు స్వ్వేర్‌తో అమ్మడి స్వరూపమే మారిపోయింది. న్యూ ఇయర్ పోస్టర్‌తోనే మతులు పోయాయనుకుంటే.. రిలీజ్ డేట్ పోస్టర్‌లో మరింత రెచ్చిపోయారు ఈ బ్యూటీ.

సిద్ధూ జొన్నలగడ్డతో జోడీ అన్నపుడే కచ్చితంగా అనుపమ నెక్ట్స్ లెవల్‌లో రెచ్చిపోతారని ఊహించారు కానీ మరీ ఇంతగా ఊపేస్తుందని మాత్రం ఊహించలేదు.

కేవలం అనుపమ అందాలతోనే టిల్లు స్క్వేర్ ఓపెనింగ్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉండటం ఖాయం. ఇక సిద్ధూ ఎలాగూ ఉండనే ఉన్నారు. మార్చ్ 29న విడుదల కానుంది టిల్లు స్క్వేర్. మరి చూడాలిక అనుపమ కెరీర్ ఈ సినిమా తర్వాత ఎలాంటి మలుపులు తిరగబోతుందో..?




